కురులకు.. ఉల్లి నూనె!

పని ఒత్తిడి, వాతావరణ కాలుష్యం కారణంగా చాలామందికి చిన్న వయసులోనే వివిధ రకాల జుట్టు సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని దూరం చేసుకునేందుకు మార్కెట్లో దొరికే వివిధ రకాల హెయిర్‌ కేర్‌ ఉత్పత్తులు, నూనెలను ఆశ్రయిస్తున్నారు.

Published : 15 Apr 2024 12:28 IST

పని ఒత్తిడి, వాతావరణ కాలుష్యం కారణంగా చాలామందికి చిన్న వయసులోనే వివిధ రకాల జుట్టు సమస్యలు తలెత్తుతున్నాయి. వీటిని దూరం చేసుకునేందుకు మార్కెట్లో దొరికే వివిధ రకాల హెయిర్‌ కేర్‌ ఉత్పత్తులు, నూనెలను ఆశ్రయిస్తున్నారు. కానీ, ఇలాంటి ఉత్పత్తులను ఇంట్లోనే సహజసిద్ధంగా చేసుకోవచ్చు. ఈ ఉల్లి నూనె అలాంటిదే!

కావాల్సినవి

⚛ కొబ్బరినూనె- అరకప్పు

⚛ కరివేపాకు - 15 నుంచి 20 రెబ్బలు

⚛ మెంతులు - టేబుల్‌ స్పూన్

⚛ ఉల్లిపాయ- (సన్నగా తరుక్కోవాలి)

తయారీ

పైన చెప్పిన పదార్థాలన్నీ ఓ మందపాటి పాత్రలో తీసుకుని మీడియం మంటపై అరగంట పాటు మరగనివ్వాలి. ఆ తర్వాత మిశ్రమాన్ని చల్లారనిచ్చి వడకట్టాలి. ఈ నూనెను బాటిల్‌లో నింపి.. మీకు కావాల్సినప్పుడు ఉపయోగించచ్చు.

ప్రయోజనాలివే!

⚛ కరివేపాకులో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుకు కావాల్సిన తేమను అందించి సహజమైన మాయిశ్చరైజర్‌లా పనిచేస్తాయి. ఇందులోని ప్రొటీన్లు జుట్టుకు పటుత్వాన్ని అందిస్తాయి.

⚛ వాతావరణ కాలుష్య ప్రభావం కురులపై పడకుండా కొబ్బరి నూనె రక్షణ కలిగిస్తుంది. కుదుళ్లకు బలాన్ని అందించి జుట్టు చివర్లు చిట్లిపోకుండా కాపాడుతుంది.

⚛ మెంతుల్లో ఉండే ప్రొటీన్‌, నికోటినిక్‌ యాసిడ్‌.. చుండ్రు సమస్యను తగ్గిస్తుంది.

⚛ ఇక ఉల్లిపాయ జుట్టు రాలడాన్ని అరికట్టి ఒత్తుగా పెరిగేలా చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్