చలికాలంలో చర్మం ప్రకాశవంతంగా..!

చలికాలం వచ్చిందంటే చాలు.. రకరకాల చర్మసమస్యలను కూడా మోసుకొస్తుంది. ఫలితంగా పొడిబారిన చర్మం నిర్జీవంగా మారిపోయి ముఖమంతా కాంతివిహీనంగా తయారవుతుంది. మరి, ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఇంట్లో లభ్యమయ్యే పదార్థాలతో తయారుచేసుకొని....

Published : 11 Nov 2022 21:03 IST

చలికాలం వచ్చిందంటే చాలు.. రకరకాల చర్మసమస్యలను కూడా మోసుకొస్తుంది. ఫలితంగా పొడిబారిన చర్మం నిర్జీవంగా మారిపోయి ముఖమంతా కాంతివిహీనంగా తయారవుతుంది. మరి, ఈ సమస్యల నుంచి బయటపడడానికి ఇంట్లో లభ్యమయ్యే పదార్థాలతో తయారుచేసుకొని ఉపయోగించే కొన్ని ప్యాక్స్ గురించి తెలుసుకుందాం రండి..

వేపాకులతో..

వేపాకులు, తులసి ఆకులను గుప్పెడు చొప్పున తీసుకొని బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న పొడిలో తేనె, చందనం చెంచా చొప్పున వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ ప్యాక్‌ని ముఖం, మెడ, చేతులు.. చర్మం డల్‌గా మారిన ప్రాంతంలో అప్త్లె చేసి 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. చర్మంపై ఉండే మొటిమలు, వాటి వల్ల ఏర్పడిన మచ్చలు.. వంటి వాటిని తగ్గుముఖం పట్టేలా చేయడంలో వేప ముందు వరుసలో ఉంటుంది. అలాగే చర్మం తాజాగా, ఆరోగ్యంగా కనిపించేలానూ చేస్తుంది.

ఆరెంజ్, గ్రీన్ టీతో..

ఎండబెట్టిన గ్రీన్ టీ ఆకులు కొద్దిగా తీసుకొని పొడి చేసుకోవాలి. అందులో కొద్దిగా యాపిల్ సిడార్ వెనిగర్, ఆరెంజ్ జ్యూస్ వేసి మెత్తని మిశ్రమంలా కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ని డల్ స్కిన్ ఉన్న చోట అప్త్లె చేసి 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లని నీళ్లతో శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి పోషణ అందించడం ద్వారా తిరిగి ప్రకాశవంతంగా మెరిసేలా చేస్తాయి.

కలబంద, బాదం నూనె..

చలికాలంలో తలెత్తే రకరకాల చర్మ సమస్యలకు ఒక్క ప్యాక్‌తో చెక్ పెట్టాలనుకునేవారు ఈ ప్యాక్‌ని ప్రయత్నించవచ్చు. కలబంద గుజ్జు ఒక చెంచా తీసుకొని అందులో అరచెంచా బాదం నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ, చేతులు.. మొదలైన ప్రాంతాల్లో అప్త్లె చేసుకొని 15 నుంచి 20 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ద్వారా చర్మానికి అవసరమైన తేమ అందడంతో పాటు తక్షణమే మెరుపు కూడా సంతరించుకుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్