మెడ చుట్టూ నల్లగా అవుతోందా?

గర్భం దాల్చిన విషయం తెలియగానే ఒక మహిళకు కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. అయితే గర్భం దాల్చినపుడు శరీరంలో జరిగే మార్పుల వల్ల కొంతమందిలో సౌందర్యపరంగా సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా మెడ చుట్టూ నల్లగా తయారవడం అనేది గర్భిణులందరికీ ఎదురయ్యే సాధారణ సమస్య.

Published : 23 Apr 2024 12:48 IST

గర్భం దాల్చిన విషయం తెలియగానే ఒక మహిళకు కలిగే ఆనందం మాటల్లో వర్ణించలేనిది. అయితే గర్భం దాల్చినపుడు శరీరంలో జరిగే మార్పుల వల్ల కొంతమందిలో సౌందర్యపరంగా సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా మెడ చుట్టూ నల్లగా తయారవడం అనేది గర్భిణులందరికీ ఎదురయ్యే సాధారణ సమస్య. అలా ఏర్పడిన నలుపుదనాన్ని ఎలా తగ్గించుకోవాలో తెలీక చాలామంది సతమతమవుతూ ఉంటారు. అయితే ఇంట్లోనే మనకు అందుబాటులో ఉన్న పదార్థాలతోనే ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టచ్చంటున్నారు నిపుణులు. అదెలాగో తెలుసుకుందాం రండి..

కీరాదోసతో..

పరిమాణంలో చిన్నగా ఉన్న కీరాను తీసుకొని జాగ్రత్తగా తురుముకోవాలి. ఈ తురుముతో నల్లగా మారిన మెడపై పదిహేను నిమిషాల పాటు మర్దన చేసుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. కీరాదోస క్లెన్సర్‌లా పనిచేసి మెడ చర్మంపై పేరుకున్న మురికిని తొలగిస్తుంది. అలాగే చర్మం కోల్పోయిన మెరుపుని తిరిగి వచ్చేలా చేస్తుంది. కీరాదోస తురుముతో రోజూ మెడ చర్మాన్ని మర్దన చేసుకుంటూ ఉంటే కొద్ది రోజుల్లోనే పూర్వపు రంగుని సంతరించుకుంటుంది. అలాగే చర్మానికి అవసరమయ్యే తేమనందించి నిగనిగలాడేలా చేస్తుంది.

టమాటోతో..

టమాటో, నిమ్మరసం, తేనెతో తయారు చేసిన మిశ్రమం గర్భధారణ సమయంలో మెడపై ఏర్పడిన నలుపును సులభంగా తొలగిస్తుంది. కొద్దిగా టమాటో రసం తీసుకొని దానిలో కొన్ని చుక్కల నిమ్మరసం, కాస్త తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మెడకు అప్త్లె చేయాలి. ఇరవై నిమిషాలు ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. టమాటో, నిమ్మరసంలో ఉన్న విటమిన్ 'సి' నల్లగా మారిన చర్మాన్ని తిరిగి సాధారణ స్థితికి తెస్తుంది. తేనెలో ఉన్న గుణాలు చర్మానికి పోషణనిచ్చి మృదువుగా చేస్తాయి.

బంగాళాదుంపతో..

బంగాళాదుంపను తొక్కు తీసి మెత్తగా చేసుకోవాలి. దీనికి కాస్త నిమ్మరసం కూడా జత చేయాలి. ఈ మిశ్రమాన్ని మెడపై అప్త్లె చేసుకొని పదిహేను నిమిషాల తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. బంగాళాదుంప మంచి క్లెన్సర్‌గా పనిచేస్తుంది. ఇది నల్లగా మారిన చర్మాన్ని తిరిగి ప్రకాశవంతంగా అయ్యేలా చేస్తుంది. నిమ్మ బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్