Published : 27/01/2023 00:23 IST

సమస్యల్ని బీట్‌ చేద్దాం!

చర్మం కళ తప్పడం.. ముడతలు, మొటిమలు.. కళ్ల కింద నల్ల వలయాలు, ముడతలు.. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య! అన్నింటికీ బీట్‌రూట్‌తో చెక్‌ పెట్టేయొచ్చు అంటున్నారు నిపుణులు..

* క్యారెట్‌, బీట్‌రూట్‌ సమపాళ్లలో తీసుకోవాలి. వాటిని మిక్సీ పట్టి, ఐస్‌ట్రేలో పెట్టి ఫ్రీజ్‌ చేయండి. ఒక క్యూబ్‌తో రోజూ ఉదయాన్నే 5-10 నిమిషాలు ముఖంపై రుద్ది, గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఆపై మాయిశ్చరైజర్‌ రాస్తే సరి.

* పావుకప్పు బీట్‌రూట్‌ తురుముకి రెండు స్పూన్ల పెరుగు, కొన్ని చుక్కల బాదం నూనె కలిపి ముఖం, మెడకు పట్టించి కొద్దిసేపు మర్దనా చేయాలి. పావుగంట వదిలేసి, కడిగేసేయాలి.

* ఒక టేబుల్‌ స్పూను బీట్‌రూట్‌ రసానికి మూడు స్పూన్ల పెరుగు కలిపి ముఖానికి పూతలా వేయాలి. పావుగంట అలాగే ఉంచి, ఆపై గోరువెచ్చని నీటితో కడిగేయాలి.

లాభాలేంటి..

* కొలాజెన్‌ ఉత్పత్తికి బీట్‌రూట్‌ సాయపడుతుంది. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు చర్మ సమస్యలను దూరం చేస్తుంది.

* దీనిలోని పొటాషియం, ఐరన్‌, మాంగనీస్‌, ఫోలేట్‌, బి, సి విటమిన్లు చర్మానికి కావాల్సిన పోషణతోపాటు తేమనీ అందిస్తాయి. కళ్లకింది వలయాలను అరికడతాయి.

* బీట్‌రూట్‌లోని లైకోపిన్‌ చర్మంలోని సాగేగుణాన్ని మెరుగుపరుస్తుంది. ముడతలు, గీతలు రాకుండా చూస్తుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని