Health: చుండ్రు చంపుతోందా..

ఒకప్పుడు తలస్నానం చేయడానికి కుంకుడుకాయల్ని మాత్రమే వాడేవాళ్లం. సౌకర్యం పేరుతో వాటి స్థానంలోకి ఇప్పుడు షాంపూలను తెచ్చుకున్నాం.

Published : 22 May 2023 00:14 IST

ఒకప్పుడు తలస్నానం చేయడానికి కుంకుడుకాయల్ని మాత్రమే వాడేవాళ్లం. సౌకర్యం పేరుతో వాటి స్థానంలోకి ఇప్పుడు షాంపూలను తెచ్చుకున్నాం. కానీ, కుంకుళ్ల ప్రత్యేకత తెలిస్తే... తిరిగి వాటిని వాడటం ఖాయం. అవేంటంటారా?

* కుంకుడు కాయల్లో యాంటీ మైక్రోబియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాల వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా ఎదుగుతుంది. కుంకుడు రసంలో కాస్త మెంతిపిండి కూడా నానబెట్టి తలస్నానం చేస్తే...కురులు పట్టుకుచ్చుల్లా మారతాయి.

* చుండ్రు చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య... దీనికి కుంకుడు కాయలు చక్కటి ఔషధం. ఈ రసంలో మందార ఆకులను నూరి కలిపి రుద్దాలి. ఇలా కనీసం రెండు మూడు రోజులకోసారైనా చేస్తుంటే సమస్య దూరమవుతుంది. మాడు ఆరోగ్యంగా మారి రాలిన జుట్టు తిరిగి వస్తుంది.

* కుంకుడుకాయలకు యాంటీ అలర్జీ, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఎక్కువ. అందుకే దీన్ని చర్మానికి క్లెన్సర్‌గానూ వాడుతుంటారు. ఫలితంగా మొటిమలూ, వాటి తాలూకు మచ్చలూ దూరమవుతాయి. ఇందుకోసం కుంకుడు రసంలో ముంచిన దూదితో ముఖాన్ని శుభ్రం చేస్తే చాలు. రోజూ ఇలా చేస్తుంటే క్రమంగా సమస్య దూరమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్