ప్రెగ్నెన్సీలో థైరాయిడ్.. బేబీకి కూడా వస్తుందా?

నాకు ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్‌ వచ్చింది. అందుకు సంబంధించిన మందులు కూడా వాడాను. నెల రోజుల క్రితం నాకు పాప పుట్టింది. పాపకు రక్త పరీక్ష చేస్తే థైరాయిడ్‌ ఉందని తేలింది. నాకు థైరాయిడ్‌ ఉంటే పాపకు వస్తుందా? ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి

Published : 27 Apr 2023 12:33 IST

నాకు ప్రెగ్నెన్సీ సమయంలో థైరాయిడ్‌ వచ్చింది. అందుకు సంబంధించిన మందులు కూడా వాడాను. నెల రోజుల క్రితం నాకు పాప పుట్టింది. పాపకు రక్త పరీక్ష చేస్తే థైరాయిడ్‌ ఉందని తేలింది. నాకు థైరాయిడ్‌ ఉంటే పాపకు వస్తుందా? ఇలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. - ఓ సోదరి

జ. థైరాయిడ్‌ సమస్య రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి హైపో థైరాయిడిజం. రెండోది హైపర్‌ థైరాయిడిజం. హైపర్‌ థైరాయిడిజం ఉన్నప్పుడు యాంటీ థైరాయిడ్‌ మందులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ మెడిసిన్‌ రక్తం నుంచి మాయ ద్వారా బేబీలోకి వెళ్లి బేబీకి కూడా థైరాయిడ్‌ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ యాంటీ థైరాయిడ్‌ మందులు బేబీ బ్లడ్‌ నుంచి నెమ్మదిగా క్లియర్‌ అయ్యి సాధారణ స్థితికి చేరుకుంటుంది.

హైపో థైరాయిడిజం ఉన్నవారిలో ఆటో యాంటీ బాడీస్ మాయ ద్వారా బేబీలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా బేబీకి థైరాయిడ్‌ సమస్య వస్తుంటుంది. ఈ ఆటో యాంటీ బాడీస్ క్లియర్‌ అవ్వడానికి మూడు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది. అయితే బేబీలో వచ్చే థైరాయిడ్ సమస్యలు చాలావరకు తాత్కాలికంగానే ఉంటాయి. తల్లికి థైరాయిడ్‌ సమస్య ఉన్నప్పుడు బేబీకి వచ్చే అవకాశం 10 శాతం కంటే తక్కువగానే ఉంటుంది. కాబట్టి, ముందుగా మీకు ఏ థైరాయిడ్‌ సమస్య ఉందో చెక్‌ చేసుకోవడం ముఖ్యం.

సాధారణంగా బేబీ పుట్టిన తర్వాత మూడో రోజు థైరాయిడ్‌ టెస్ట్‌ చేస్తుంటారు. యాంటీ బాడీస్‌ వల్ల కానీ, మందుల వల్ల వచ్చే థైరాయిడ్‌ సమస్య బేబీలో అప్పటికీ క్లియర్‌ కాకపోతే పాజిటివ్‌ వస్తుంటుంది. బేబీలో TSH హార్మోన్‌ స్థాయులను బట్టి మూడు నుంచి నాలుగు నెలల పాటు మెడికేషన్‌ ఇస్తుంటారు. ఒకవేళ అప్పటికీ సమస్య తగ్గకపోతే డాక్టర్‌ సూచించిన సమయం వరకు మందులు వాడాల్సి ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని