బేబీకి విటమిన్‌ ‘డి’ సప్లిమెంట్స్‌ ఎంతకాలం ఇవ్వాలి?

వైద్యుడి సలహా మేరకు పాప పుట్టిన రెండో రోజు నుంచి విటమిన్‌ ‘డి’ డ్రాప్స్‌ వాడుతున్నాం. ఉదయం పూట కొద్దిసేపు ఎండ తగిలేలా ఉంచుతున్నాం. అయితే ఇలా విటమిన్‌ ‘డి’ డ్రాప్స్‌ ఇంకా ఎంతకాలం వాడాలి?

Published : 11 Dec 2023 12:20 IST

మా పాప వయసు రెండు నెలలు. ప్రస్తుతం మూడు కిలోల బరువుతో ఆరోగ్యంగా ఉంది. పాపకు నా పాలే పడుతున్నాను. అయితే వైద్యుడి సలహా మేరకు పాప పుట్టిన రెండో రోజు నుంచి విటమిన్‌ ‘డి’ డ్రాప్స్‌ వాడుతున్నాం. ఉదయం పూట కొద్దిసేపు ఎండ తగిలేలా ఉంచుతున్నాం. అయితే ఇలా విటమిన్‌ ‘డి’ డ్రాప్స్‌ ఇంకా ఎంతకాలం వాడాలి? - ఓ సోదరి

జ. పిల్లలకు మొదటి రెండు సంవత్సరాలు విటమిన్ ‘డి’ సప్లిమెంట్స్‌ ఇవ్వాలని ‘ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌(IAP)’ సూచిస్తోంది. పలు అంతర్జాతీయ సంస్థలు కూడా రోజుకు 400IU చొప్పున విటమిన్‌ ‘డి’ సప్లిమెంట్స్‌ ఇవ్వాలని సూచిస్తున్నాయి. ఇది బ్రెస్ట్‌ ఫీడింగ్‌, ఫార్ములా ఫీడింగ్‌, సెమీ బ్రెస్ట్‌ ఫీడింగ్‌ ద్వారా పాలు తాగే పిల్లలకూ వర్తిస్తుంది. ఎందుకంటే ఈ మూడు పద్ధతుల్లో పట్టే పాలలో విటమిన్‌ ‘డి’ తక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లలకు సరిపడినంత విటమిన్‌ ‘డి’ అందదు.

సాధారణంగా పిల్లలకు మొదటి సంవత్సరం వరకు 400IU చొప్పున, రెండు సంవత్సరాలు నిండే వరకు 800IU చొప్పున విటమిన్ ‘డి’ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే మీరు పాపకు ఎండ తగిలేలా ఉంచుతున్నామని చెప్పారు. అది కొంతవరకు మంచిదే అయినా సూర్యరశ్మి ద్వారా శరీరానికి సరిపడినంత విటమిన్‌ ‘డి’ లభించదు. మనదేశంలో సంవత్సరం పొడవునా సూర్యరశ్మి ఉన్నా చాలామందికి విటమిన్‌ ‘డి’ లోపం ఉంటుంది. దీనికి మన చర్మ రంగు కూడా ఓ కారణమే! చర్మం ముదురు రంగులో ఉండడం వల్ల విటమిన్‌ ‘డి’ శరీరానికి అందే అవకాశం తక్కువ. అలాగే ఎక్కువసేపు ఎండ తగిలేలా చేయడం వల్ల పలు చర్మ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని బేబీకి ఎక్కువసేపు ఎండ తగలకుండా జాగ్రత్తపడడం మంచిది. ఈ లోటును పూడ్చడానికి పిల్లలకు మొదటి రెండు సంవత్సరాల వరకు విటమిన్‌ ‘డి’ సప్లిమెంట్స్‌ ఇవ్వాలి. తద్వారా వారిలో ఎదుగుదల కూడా బాగుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్