కాళ్ల నొప్పులకు ఉపశమనం

మనలో చాలామందికి తరచుగా కాళ్ల నొప్పులు వస్తుంటాయి. వంట చేసినంతసేపూ నిలబడటం వల్ల నొప్పి లెమ్మని సరిపెట్టుకుంటాం. నిజానికి దీనికి పోషకాహారం తీసుకోకపోవడం ఒక కారణమైతే శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం రెండో కారణం. ఈ బాధ నుంచి ఉపశమనానికి జాను శీర్షాసనం వేసి చూడండి. సత్వర ప్రయోజనం ఉంటుంది.

Published : 18 Mar 2023 00:06 IST

మనలో చాలామందికి తరచుగా కాళ్ల నొప్పులు వస్తుంటాయి. వంట చేసినంతసేపూ నిలబడటం వల్ల నొప్పి లెమ్మని సరిపెట్టుకుంటాం. నిజానికి దీనికి పోషకాహారం తీసుకోకపోవడం ఒక కారణమైతే శరీరానికి సరైన వ్యాయామం లేకపోవడం రెండో కారణం. ఈ బాధ నుంచి ఉపశమనానికి జాను శీర్షాసనం వేసి చూడండి. సత్వర ప్రయోజనం ఉంటుంది.

ఎలా చేయాలి... నిటారుగా కూర్చుని కాళ్లను ముందుకు చాపాలి. కుడి మోకాలిని వంచి ఆ పాదాన్ని ఎడమ తొడ వద్ద ఉంచాలి. రెండు చేతులనూ తలకు అటూ ఇటూ ఉంచి, ముందుకు వంగి ఎడమ కాలి మీద శరీరాన్ని తాకించాలి. చేతులను ముందుకు తెచ్చి పాదాన్ని పట్టుకోవాలి. నెమ్మదిగా పూర్వ స్థానానికి రావాలి. ఇలాగే రెండో కాలితో చేయాలి. కిందికి వంగినప్పుడు, పైకి లేచినప్పుడు కూడా వెన్నుభాగం వీలైనంత నిటారుగా ఉండేలా, భుజాలు సేదతీరేలా చూడండి. నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటూ వదులుతూ ఉండండి.

ప్రయోజనాలు...

కండరాలు బలపడతాయి, కాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

వెన్ను బలపడుతుంది. నడుం నొప్పి రాదు.

మెదడు శాంతంగా ఉంటుంది. ఆందోళనలు తగ్గుతాయి.

జీర్ణప్రక్రియ మెరుగవుతుంది.

తుంటి భాగాలు, మెడ, భుజాలు, వెన్ను పట్టేసినట్లు ఉండటం తగ్గుతుంది.

నెలసరి ఇబ్బందులు తొలగుతాయి.

కాలేయం, మూత్రపిండాలు ఉత్తేజితం అవుతాయి.

మెనోపాజ్‌ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

జాగ్రత్తలు...

రీరాన్ని ఎంతవరకూ వంచగలిగితే అంతవరకే వంచండి. కాలికి పొట్ట, ఉదరభాగం ఒక్కరోజులోనే తాకాలనుకోవద్దు. సాధనతో అది నెమ్మదిగా సాధ్యపడుతుంది.

మడిచిన కాలి పాదం రెండో కాలి తొడ వరకూ వెళ్లడం కష్టమనిపిస్తే మోకాలి వద్దే పెట్టండి. కొద్దికొద్దిగా జరుపుతూ కొన్ని రోజుల తర్వాత తొడ వద్దకు తీసుకెళ్లొచ్చు.

కాళ్ల నొప్పులతో అసౌకర్యంగా ఉంటే మడిచిన మోకాళ్ల కింద మెత్తటి దుప్పటి పెట్టండి. తేలికవుతుంది.

నడుం నొప్పితో బాధపడుతున్నవాళ్లు ఈ ఆసనం చేయకూడదు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్