ఇంట్లోనే కర్లీ హెయిర్..!

అమ్మాయిల్లో కొందరి జుట్టు సాఫ్ట్‌గా, స్ట్రెయిట్‌గా ఉంటే.. మరికొందరికి కర్లీ హెయిర్ ఉంటుంది. అయితే సాఫ్ట్, స్ట్రెయిట్ హెయిర్ ఉన్నవాళ్లు కూడా ఇంట్లోనే కొద్దిపాటి జాగ్రత్తలతో వారి హెయిర్‌స్త్టెల్‌ని కర్లీగా మార్చేసుకోవచ్చు. అలల్లాంటి ఉంగరాల....

Published : 26 Sep 2022 21:48 IST

అమ్మాయిల్లో కొందరి జుట్టు సాఫ్ట్‌గా, స్ట్రెయిట్‌గా ఉంటే.. మరికొందరికి కర్లీ హెయిర్ ఉంటుంది. అయితే సాఫ్ట్, స్ట్రెయిట్ హెయిర్ ఉన్నవాళ్లు కూడా ఇంట్లోనే కొద్దిపాటి జాగ్రత్తలతో వారి హెయిర్‌స్త్టెల్‌ని కర్లీగా మార్చేసుకోవచ్చు. అలల్లాంటి ఉంగరాల జుట్టుతో కొత్తకొత్తగా కనిపించవచ్చు.

కర్లీగా ఇలా..

❀ ముందు తలస్నానం చేసి, జుట్టుకి కండిషనర్ అప్త్లె చేయాలి. తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి.

❀ ఇప్పుడు ఒక పొడి టవల్ తీసుకుని జుట్టు తడి ఆరే వరకు బాగా తుడవాలి.

❀ చిక్కులు లేకుండా దువ్వుకుని హెయిర్ డ్రయర్‌తో తల బాగా ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు కాస్త ఒత్తుగా కనిపించే అవకాశం ఉంటుంది.

❀ ఇప్పుడు జుట్టుని పై నుంచి కిందకు మూడు లేదా నాలుగు భాగాలుగా విభజించి, కింద జుట్టుని వదిలేసి పై భాగాలు కింద పడకుండా విడివిడిగా క్లిప్స్ పెట్టుకోవాలి.

❀ కర్లింగ్ ఐరన్ మెషీన్ తీసుకుని కింద విడిచిపెట్టిన జుట్టుని జాగ్రత్తగా దాని చుట్టూ చుట్టినట్లు చేయాలి. కొన్ని సెకన్ల పాటు ఇలా ఉంచి తీస్తే జుట్టు దానంతటదే ఉంగరాలు తిరిగినట్లు కనిపిస్తుంది.

❀ మిగతా భాగాలలో కూడా కర్లింగ్ ఐరన్‌తో ఇలానే చేయాలి. ఫలితంగా మొత్తం జుట్టంతా ఉంగరాల జుట్టులా మారిపోతుంది.

❀ ఇలా కర్లింగ్ మెషీన్ ఉపయోగించే ముందు అవసరమనిపిస్తే జుట్టుకి హెయిర్ క్రీమ్ అప్త్లె చేస్తే మరీ మంచిది. అయితే ఇది కూడా మరీ ఎక్కువగా కాకుండా అవసరమైనంత మేరకే ఉపయోగించాలి.

❀ క్రీమ్ రాసిన తర్వాత జుట్టు చిక్కుపడినట్లుగా లేదా ముద్దగా అనిపించినా దువ్వెనతో చిక్కులు లేకుండా దువ్వుకుని తర్వాత కర్లింగ్ మెషీన్‌తో కర్ల్స్ తిప్పుకోవచ్చు.

❀ జుట్టంతా కర్ల్స్ తిప్పుకోవడం పూర్త్తెన తర్వాత కాసేపు అలా వదిలేయాలి. అప్పుడే మెషీన్ ద్వారా తల్లో చేరిన వేడి తగ్గి జుట్టు తిరిగి యథాస్థితికి చేరుకుంటుంది.

❀ ఇప్పుడు మీ మునివేళ్లతో కర్ల్స్‌లో ఉన్న వెంట్రుకలను సులభంగా విడదీసుకోవచ్చు.

ఇలా కూడా..

ఒక స్ప్రే బాటిల్‌లో గోరువెచ్చని నీరు, రెండు చెంచాల ఉప్పు, పావుకప్పు కండిషనర్ వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని బాగా షేక్ చేసి శుభ్రంగా ఉన్న జుట్టు మీద స్ప్రే చేయండి. అంతే.. కాసేపటి తర్వాత చూడండి.. మీ జుట్టు అలల్లా ఎగసిపడుతూ ఉండటాన్ని మీరే గమనించవచ్చు. అయితే ఈ విధంగా కేవలం వేవీ లుక్‌ని మాత్రమే పొందగలం. అప్పటికప్పుడు బయటకు వెళ్లడానికి, పార్టీలకు హాజరు కావడానికి ఇలాంటి స్త్టెల్స్ బాగా నప్పుతాయి.

జాగ్రత్తలు..

జుట్టుని ఉంగరాలు తిప్పడానికి ఉపయోగించే మెషీన్ చాలా ఎక్కువ మొత్తంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఇది శిరోజాల ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే వీలైనంత తక్కువ సమయం దాన్ని ఉపయోగించడం మేలు. అలాగే మరీ తరచుగా కాకుండా ఇలాంటి ప్రయోగాలు అరుదుగా చేయడం మేలు. అప్పుడే జుట్టు కూడా అందంగా నిగనిగలాడుతూ కనిపిస్తుంది. లేదంటే స్త్టెల్ మాట పక్కన పెడితే అధిక ఉష్ణోగ్రత వల్ల మొత్తం జుట్టు బిరుసుబారిపోయే లేదా ఊడిపోయే అవకాశాలు లేకపోలేవు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్