దగ్గు.. జలుబా? ఉల్లినీళ్లు తాగేయండి!

అసలే చలికాలం.. కొత్త ఏడాది సంబరాలంటూ చల్లగాలికి తిరగడం, తీపి పదార్థాలు తినేసుంటారు. జలుబు, దగ్గు పలకరించకుండా ఉంటాయా? దానికి సహజ పరిష్కారంగా ఉల్లినీళ్లు ప్రయత్నించమంటున్నారు నిపుణులు. రెండు పచ్చి ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా తరిగి, ఒక స్టీలు గిన్నెలో ఉంచండి.

Published : 03 Jan 2023 01:08 IST

అసలే చలికాలం.. కొత్త ఏడాది సంబరాలంటూ చల్లగాలికి తిరగడం, తీపి పదార్థాలు తినేసుంటారు. జలుబు, దగ్గు పలకరించకుండా ఉంటాయా? దానికి సహజ పరిష్కారంగా ఉల్లినీళ్లు ప్రయత్నించమంటున్నారు నిపుణులు.

రెండు పచ్చి ఉల్లిపాయల్ని చిన్న ముక్కలుగా తరిగి, ఒక స్టీలు గిన్నెలో ఉంచండి. దానికి లీటరుపైగా నీళ్లు చేర్చి.. ఒక గంట వదిలేయండి. తర్వాత ఆ నీటిని తాగితే సరి. లేదూ ఆ మిశ్రమాన్ని రాత్రంతా ఫ్రిజ్‌లో ఉంచి, మరుసటి రోజు చల్లదనం తగ్గాకైనా తీసుకోవచ్చు. ఉల్లిలో సల్ఫర్‌ అధికం. ఇది శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించడంలో సాయ పడుతుంది. అలా జలుబు, దగ్గు తగ్గుతాయి. అయితే దీన్ని రుజువు చేసే శాస్త్రీయ ఆధారాలైతే లేవు. దీనివల్ల శరీరానికి మేలే కానీ సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఏమీఉండవు. పైగా ఇన్‌ఫ్లమేషన్‌, నొప్పి వంటివి తగ్గించడంలో ఉల్లి బాగా సాయపడుతుంది. కాబట్టి, జలుబుకు వ్యతిరేకంగానూ పని చేస్తుందంటారు నిపుణులు.
ఉల్లిలో ఫైబర్‌, ఫోలిక్‌ యాసిడ్‌, విటమిన్‌ బి6 వంటివి మెండు. ఇవి శరీరంలో కొత్త కణాల ఉత్పత్తికి సాయపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు, సల్ఫర్‌ క్యాన్సర్‌కి వ్యతిరేకంగా పోరాడటమే కాదు రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండటానికీ, ఎముకల ఆరోగ్యానికీ సాయపడతాయి. జుట్టు ఆరోగ్యంగా పెరగడంలోనూ సాయపడతాయి. సల్ఫర్‌ అలర్జీలు ఉన్నవారు మాత్రం దీనికి దూరంగా ఉంటే సరిపోతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్