నా చర్మం రంగు మారిపోతుంది.. ఎందుకిలా?
స్నానం చేశాక లేదా ఏదైనా ఫేషియల్ చేయించుకున్నాక నా చర్మం చామన ఛాయ రంగులో కనిపిస్తుంది. ఆపై మూడు నాలుగ్గంటల తర్వాత మళ్లీ నల్లగా మారిపోతుంది. అలాగే ఆకలి వేసినా నా స్కిన్ కలర్ మారిపోతుంటుంది. స్కిన్ వైటెనింగ్ కోసం బీట్రూట్ తింటున్నా.
స్నానం చేశాక లేదా ఏదైనా ఫేషియల్ చేయించుకున్నాక నా చర్మం చామన ఛాయ రంగులో కనిపిస్తుంది. ఆపై మూడు నాలుగ్గంటల తర్వాత మళ్లీ నల్లగా మారిపోతుంది. అలాగే ఆకలి వేసినా నా స్కిన్ కలర్ మారిపోతుంటుంది. స్కిన్ వైటెనింగ్ కోసం బీట్రూట్ తింటున్నా. దీనివల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? అలాగే ఉదయం నా చర్మం బాగానే ఉంటుంది.. కానీ సాయంత్రానికల్లా తిరిగి జిడ్డుగా మారిపోతుంది. జిడ్డుదనం తగ్గాలన్నా, చర్మం తెల్లబడాలన్నా ఏదైనా పరిష్కార మార్గం ఉంటే చెప్పండి. - ఓ సోదరి
జ: మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీ శరీరంలో నీటి స్థాయులు తక్కువగా ఉన్నాయని అర్థమవుతుంది. అందుకోసమే రోజూ 8-12 గ్లాసుల నీళ్లు తాగాలి. అలాగే మీరు స్కిన్ వైటెనింగ్ కోసం బీట్రూట్ తింటున్నానని చెప్పారు. కానీ దానివల్ల చర్మ ఛాయ పెరగడం కంటే హెమోగ్లోబిన్ స్థాయులు పెరగడానికే అది ఎక్కువగా దోహదం చేస్తుంది. కాబట్టి దీనితో పాటు క్యారట్, పుచ్చకాయ.. వంటివి కూడా మీరు రోజువారీ ఆహారంలో తప్పకుండా భాగం చేసుకోవాలి. వీటిని పచ్చిగా తినడం ఇష్టం లేకపోతే రసం చేసుకొనైనా తాగచ్చు. ఇలా మీరు దాదాపు మూడు నెలల పాటు తీసుకుంటే మీ చర్మ ఛాయలో తప్పకుండా మార్పు కనిపిస్తుంది. ఈ ఆహారం వల్ల చర్మానికి లోలోపలి నుంచి మెరుపు వస్తుంది.
అలాగే ఆకలి వేసినా చర్మ రంగు మారిపోతుందని చెప్పారు.. కానీ శరీరంలో నీటి స్థాయులు తగ్గిపోవడం వల్ల ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది.. అందుకే మీ చర్మ ఛాయ తగ్గుతున్నట్లుగా మీకు అనిపిస్తుండచ్చు. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో ఉత్పత్తయ్యే ఉష్ణోగ్రతను తగ్గించచ్చు. దీంతో పాటు కీరా ముక్కలు తినడం వల్ల కూడా అటు శరీరం తేమగా మారడంతో పాటు చర్మం లోలోపలి నుంచి కాంతివంతంగా తయారవుతుంది.
ఇక మీ చర్మం సాయంత్రానికల్లా బాగా జిడ్డుగా మారుతుందని చెప్పారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే గంధం ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది. ఇందుకోసం.. గంధం, రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా తయారుచేసుకొని రాత్రి పడుకునే ముందు ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. ఇలా 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచుకొని కడిగేసుకుంటే జిడ్డు తొలగిపోతుంది. ఈ చిట్కాలన్నీ క్రమం తప్పకుండా మూడు నెలల పాటు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది.
చివరిగా ఒక్క మాట.. శరీరం రంగేదైనా మన మొహంలో ఆత్మ విశ్వాసం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటే అంతకు మించిన కళ ఏదీ ఉండదన్నది గుర్తు పెట్టుకోండి. నలుపా, తెలుపా అన్నది మర్చిపోయి తిరుగులేని ఆత్మ విశ్వాసంతో ముందుకు దూసుకుపోండి!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
బ్యూటీ & ఫ్యాషన్
- పాదాలు పదిలంగా
- స్లిట్... మరింత స్టైల్‌గా!
- చల్లటి పాలతో..!
- Makeup: ఈ పొరపాట్లు వద్దు!
- మ్యాచింగ్ పోట్లీ మస్తుంది!
ఆరోగ్యమస్తు
- కోపాన్ని తగ్గించే శశాంకాసనం!
- పోషకాల ‘పుట్ట’... ఆరోగ్యానికి ‘గొడుగు’
- అలసట లేకుండా పని చేయాలంటే..!
- ఎత్తును బట్టే..!
- Nayanthara : నచ్చిందే తింటా.. నోరు కట్టేసుకోను!
అనుబంధం
- మీరైతే ఏం చేస్తారు?
- కొలీగ్‌తో రెండో పెళ్లి.. పేరెంట్స్ వద్దంటున్నారు!
- ‘777’ నియమంతో... బంధం బలోపేతం!
- పిల్లలకు ఎలాంటి పుస్తకం కొంటున్నారు..?
- వాళ్ల ప్రేమ నిజమా? నకిలీనా?
యూత్ కార్నర్
- ఒలింపిక్స్ బరిలో... బిహార్ ఎమ్మెల్యే!
- Paris Olympics: అందుకే ఈసారి వీళ్లు ప్రత్యేకం!
- పాపులారిటీ కోసం ప్రాణాలెందుకు రిస్క్‌లో పెడతారు?!
- తెలుగమ్మాయి... బ్రిటన్‌లో మెరిసింది!
- వాళ్లున్నప్పుడు మారిపోతాడు!
'స్వీట్' హోం
- వర్షాలకు మొక్కలు పాడవకుండా..!
- మొక్కలకు కాఫీ పొడి వేస్తున్నారా?
- తగిలిస్తే... పిల్లి వచ్చే!
- నూరు వరహాలతో నిండుగా
- వ్యాపారమా... ఉద్యోగమా?
వర్క్ & లైఫ్
- కత్రినా ‘స్లిమ్’ బాడీ.. ఆ సీక్రెట్స్ ఇవే!
- Flower Truck Business: అందమైన పూల బొకేలతో.. లక్షలు సంపాదిస్తూ..!
- బరువెక్కుతున్న తెలుగు రాష్ట్రాలు!
- ఈ అలవాట్లే మనల్ని ధనవంతుల్ని చేస్తాయట!
- కేర్ టేకర్లు... కోట్లలో కావలెను!