ఇల్లే వ్యాయామశాల

ఉద్యోగం చేసే వాళ్లకే జిమ్‌ అనుకోవద్దు. గృహిణులకీ ఫిట్‌నెస్‌ చాలా అవసరం. అలాగని జిమ్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటినే వ్యాయామశాలగా మార్చేసుకుందామిలా..

Published : 26 Jan 2023 00:35 IST

ఉద్యోగం చేసే వాళ్లకే జిమ్‌ అనుకోవద్దు. గృహిణులకీ ఫిట్‌నెస్‌ చాలా అవసరం. అలాగని జిమ్‌కే వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటినే వ్యాయామశాలగా మార్చేసుకుందామిలా..

టమ్మీ ట్రిమ్మర్‌తో.. ఆఫీసుల్లో ఎక్కువ శాతం కూర్చొని పని చేస్తుంటాం. ఆ సమయంలో నడుము దగ్గర పొట్ట కింది భాగంలో కొవ్వు పేరుకుంటుంది. ఈ పరికరంతో ముందుకి వంగుతూ, లేస్తూ వ్యాయామం చేయాలి. పొట్ట భాగంలో ఉన్న కొవ్వు తేలిగ్గా కరిగిపోతుంది. చేతులు, ఛాతీ, తొడల దగ్గర కొవ్వు తగ్గి శరీరం సన్నబడుతుంది.

తాడాట.. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారికి స్కిప్పింగ్‌ మంచి వ్యాయామం అంటున్నారు నిపుణులు. దీంతో బరువు తగ్గటంతోపాటు ఎముకలు దృఢంగా మారతాయి. ఒత్తిడి తగ్గుతుంది. అరగంటసేపు తాడాట ఆడితే 400 కెలోరీలు ఖర్చవుతాయి. చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. నెలసరిలో వచ్చే సమస్యలూ తగ్గుతాయి. 10 నిమిషాలు తాడాడితే ఒక కిలోమీటరు నడకతో సమానం అంటున్నారు వ్యాయామ నిపుణులు.

ట్రెడ్‌మిల్‌తో.. గుండెజబ్బులు తగ్గుతాయి. బయటికి వెళ్లి వాకింగ్‌ చేయలేని వారికి ఇది మంచి ప్రత్యామ్నాయం. ముఖ్యంగా తొడలు, పిరుదుల దగ్గర పేరుకున్న కొవ్వును తేలిగ్గా కరిగిస్తుంది.

డంబెల్స్‌తో.. నెలసరి సమయంలో వచ్చే భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. ఆర్థ్రరైటిస్‌, గుండె జబ్బుల నుంచి ఉపశమనం కలుగుతుంది. నడుము నొప్పి, డయాబెటిస్‌ను  దరిచేరనివ్వదు. హాయిగా నిద్ర పడుతుంది. చాలామంది తారల ఫిట్‌నెస్‌ రహస్యం కూడా ఇదే. అయితే అధిక బరువులు కాకుండా 3 నుంచి 11 కేజీల వరకూ ఉన్నవి మహిళలకు మంచిదనేది వ్యాయామ నిపుణుల సలహా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్