Drinking Water: నీళ్లు తాగితే నిస్సత్తువ దూరం!

ఎండలు పెరిగిపోతున్నాయి. వాతావరణంలో తేమ తగ్గిపోతోంది. దాంతో...మన శరీరంలో కనిపించే మొదటి ఇబ్బంది డీహైడ్రేషన్‌.

Updated : 04 Mar 2023 03:02 IST

ఎండలు పెరిగిపోతున్నాయి. వాతావరణంలో తేమ తగ్గిపోతోంది. దాంతో...మన శరీరంలో కనిపించే మొదటి ఇబ్బంది డీహైడ్రేషన్‌. చూడ్డానికి చిన్న విషయంలా కనిపించినా...ఒంట్లో మెరుపు తగ్గడం నుంచి నిస్సత్తువ వరకూ ఎన్నో సమస్యలు కనిపిస్తాయి. ఆ లక్షణాలను గుర్తిస్తే...త్వరగా దాన్నుంచి బయటపడొచ్చు.

* ఒక్కోసారి ఒళ్లంతా నొప్పులు, కండరాలు పట్టేసినట్లూ ఉంటాయి. ఈ సూచనలేమీ పెద్ద పెద్ద అనారోగ్యాలకే కారణం కాకపోవచ్చు. శరీరంలో తగినన్ని నీటి నిల్వలు లేకపోవడం వల్లా అయి ఉండొచ్చు. మీరు తరచూ ఇలాంటి సమస్యతో బాధపడుతుంటే తగినన్ని నీళ్లు తాగి చూడండి.

* డీహైడ్రేషన్‌ సమస్యను గుర్తించడానికి తలనొప్పి కూడా ఓ సూచనే. ఈ సారి భరించలేని తలనొప్పి వస్తుంటే ఓ రెండు గ్లాసుల నీళ్లు తాగి చూడండి. అదుపులోకి రావొచ్చు. ఇక, మూత్రం రంగు మారితే...వెంటనే రెండు గంటలకోసారి నాలుగైదు సార్లు బార్లీ నీళ్లు తాగండి. సమస్య వెంటనే మాయం అవుతుంది.అలసట, నీరసం..వంటి లక్షణాలు కనిపిస్తే ఓ కొబ్బరిబొండం తాగండి. ఎలక్ట్రోలైట్స్‌ మీ నిస్సత్తువను తగ్గిస్తాయి. ఈ నీళ్లు శరీరంలో డీహైడ్రేషన్‌ సమస్యని అదుపులో ఉంచుతాయి. చర్మం ఆరోగ్యంగా కనిపించేలా చేస్తాయి. 

*  ఒంట్లో నీటి శాతం తగ్గితే... భావోద్వేగాల్లోనూ హెచ్చు తగ్గులు కనిపిస్తాయంటోంది ఓ అధ్యయనం. మానసిక అలసట, చికాకు ఇబ్బందిపెడతాయి. అలానే రోజు మీకు హాయిగా గడిచిపోవాలంటే కూడా ఉదయాన్నే లేచిన వెంటనే తగినన్ని నీళ్లు తాగండి. మీ శరీర జీవక్రియలన్నీ సక్రమంగా పనిచేస్తాయి.

*  ఉల్లిపాయలో, మరో రకమైన ఆహారమో తీసుకున్నప్పుడు మాత్రమే నోటిదుర్వాసన వస్తుందనుకుంటే పొరబాటు. ఇది కూడా మీ శరీరంలో నీటి శాతం తగ్గుతుందనడానికి ఓ సూచన. శరీరంలో నీటి నిల్వలు తగ్గినప్పుడు సలైవా ఉత్పత్తి తగ్గిపోవడమే ఇందుకు కారణం. ఫలితంగా బ్యాక్టీరియా పెరిగి ఈ సమస్య ఎక్కువ అవుతుంది. ఈ సమయంలో...నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ద్రవపదార్థాలను ఎక్కువగా తీసుకుంటే సరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్