‘సహజ’ సౌందర్యం!

చర్మ సౌందర్యాన్ని, కేశ సంపదను కాపాడుకోవడానికి మార్కెట్లో ఉన్న సౌందర్యోత్పత్తులకు కొదవలేదు. అయితే ఇవి అందరికీ పడకపోవచ్చు.. వీటివల్ల కొంతమందిలో పలు దుష్ప్రభావాలూ ఎదురుకావచ్చు.

Published : 21 Feb 2024 13:16 IST

చర్మ సౌందర్యాన్ని, కేశ సంపదను కాపాడుకోవడానికి మార్కెట్లో ఉన్న సౌందర్యోత్పత్తులకు కొదవలేదు. అయితే ఇవి అందరికీ పడకపోవచ్చు.. వీటివల్ల కొంతమందిలో పలు దుష్ప్రభావాలూ ఎదురుకావచ్చు. అందుకే ఈ సమస్యలన్నీ లేకుండా ఉండాలంటే ఇంట్లో దొరికే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలు మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.

పసుపు..

పసుపు మేనిఛాయను పెంచడంతో పాటు అవాంఛిత రోమాలను సైతం తగ్గిస్తుంది. ఇది చర్మంపై ముడతలను నివారిస్తుంది. దీనికోసం కొద్దిగా బియ్యప్పిండిలో పచ్చిపాలు, టొమాటో రసం కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దీనికి కొద్దిగా పసుపుని కూడా జత చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని పూర్తిగా ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

తులసి..

తులసిలోని ఔషధ గుణాలు మొటిమలను నివారించి చర్మాన్ని మృదువుగా, సున్నితంగా మార్చుతాయి. కొన్ని తులసి ఆకులను తీసుకొని మెత్తగా చేసుకోవాలి. దీనికి కొద్దిగా పాలు కలిపి ముఖానికి అప్లై చేసుకొని ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది మొటిమలను నివారించి చర్మ సంరక్షణకు తోడ్పడుతుంది.

ఉసిరి..

విటమిన్‌ ‘సి’ ఎక్కువగా ఉండే ఉసిరి చర్మంపై చేరిన బ్యాక్టీరియాను నశింపజేస్తుంది. ప్రత్యేకించి జుట్టు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది కుదుళ్లను దృఢంగా, ఒత్తుగా పెరిగేలా చేస్తుంది. అంతేకాకుండా తెల్ల జుట్టు రాకుండా నివారిస్తుంది. రెండు చెంచాల ఉసిరి రసాన్ని తీసుకొని అంతే మోతాదులో నిమ్మరసానికి జతచేయాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు అప్లై చేసి పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో తలస్నానం చేస్తే సరిపోతుంది.

వేప..

⚛ ఆరోగ్యపరంగానే కాదు.. సౌందర్య సంరక్షణలోనూ వేప ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా మొటిమల సమస్య నుంచి విముక్తి కలిగిస్తుంది. చర్మంపై చేరిన బ్యాక్టీరియా, సూక్ష్మక్రిముల్ని తొలగించి చర్మ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. కొన్ని వేపాకులను నీటిలో వేసి బాగా మరిగించాలి. దీనిలో దూదిని ముంచి ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మొటిమల సమస్య క్రమంగా తగ్గుముఖం పడుతుంది.

⚛ పొడిచర్మంతో బాధపడే వారు వేప పొడిలో కొన్ని చుక్కల ఏదైనా నూనె ఆయిల్‌ కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే చర్మం తేమను సంతరించుకుంటుంది.

⚛ చర్మ సౌందర్యం విషయంలోనే కాకుండా కురుల సంరక్షణలోనూ వేప మేలు చేస్తుంది. వేపనూనెను ఉపయోగించడం ద్వారా చుండ్రు సమస్య నుంచి విముక్తి పొందచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్