krishnan: ఎంత చేసినా తక్కువే!
తల్లిదండ్రులని కావిడికెత్తుకుని.. దేశమంతా తిరుగుతూ తీర్థయాత్రలకి తిప్పిన శ్రవణ కుమారుడి కథ తెలుసుకదా! కేరళకు చెందిన కృష్ణన్‌ని ఆధునిక శ్రవణ కుమారుడు అనొచ్చు.
తల్లిదండ్రులని కావిడికెత్తుకుని.. దేశమంతా తిరుగుతూ తీర్థయాత్రలకి తిప్పిన శ్రవణ కుమారుడి కథ తెలుసుకదా! కేరళకు చెందిన కృష్ణన్‌ని ఆధునిక శ్రవణ కుమారుడు అనొచ్చు. ఎందుకంటే ఇన్నాళ్లూ కుటుంబానికే అంకితమైన అమ్మకోసం ఇతనూ అదే బాటపట్టాడు. అమ్మని వెంటపెట్టుకుని దేశమంతా తిరుగుతూ ఆమెకి నచ్చిన ప్రదేశాలు చూపెడుతున్నాడు..
వాలెంటైన్స్ డే రోజు అబ్బాయిలు అమ్మాయిలని ఇంప్రెస్ చేసే పనిలో తీరిక లేకుండా ఉంటే.. కృష్ణన్ మాత్రం వాళమ్మ గీతమ్మని వెంటపెట్టుకుని వారణాసిలో ప్రతి ఘాట్ తిరుగుతూ ఆనందంగా ఉన్నాడు. నాకిష్టమైన అమ్మకు నేనిచ్చే కానుక ఇది అంటాడు కృష్ణన్. ఒక్క వారణాసి మాత్రమే కాదు కశ్మీర్ మొదలుకుని కన్యాకుమారి వరకూ దేశాన్ని సైకిల్‌పై, బైక్‌పై చుట్టేశారు. అద్భుతమైన దేవాలయాన్నింటినీ దర్శించుకున్నారు. ‘అమ్మ వయసు వాళ్లు ఇంట్లో వంటల ఛానళ్లు చూస్తూ, మ్యాగజైన్లు తిరగేస్తుంటే.. అమ్మ తనకిష్టమైన ట్రావెల్ మ్యాగజైన్లు చదివేది. తీర్థయాత్రలకి వెళ్లాలని.. దేశాన్ని చుట్టేయాలన్నది ఆమె కల. సరే అని ముంబయి ప్రయాణం పెడితే ఈ వయసులో నేను రాలేను అంది. ఒప్పించి తీసుకెళ్లాక ఆమె కళ్లలో ఓ మెరుపు గమనించా. ఆ తర్వాత నాకో కల.. ఆమెని వారణాసిని తీసుకెళ్లినట్టు. ఆ కలని నిజం చేశా. తర్వాత అదే కొనసాగించాను. ముగ్గురు పిల్లలని పెంచడానికి జీవితాన్ని అంకితం చేసిన అమ్మకి ఎంత చేసినా తక్కువేకదా’ అంటాడు కృష్ణన్.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.