లిచీ... గర్భిణులకు మేలేనా?

రోడ్డు పక్క బండ్లపై ఎక్కడ చూసినా లిచీ పండ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి కదూ! ఎరుపు, తెలుపు మేళవింపుతో జెల్లీలా కనిపిస్తూ తెగ నోరూరిస్తాయి. మరి తింటున్నారా? ఎందుకంటే... ఈ పండ్లు మనకి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తాయి.

Published : 12 Jun 2024 03:10 IST

రోడ్డు పక్క బండ్లపై ఎక్కడ చూసినా లిచీ పండ్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి కదూ! ఎరుపు, తెలుపు మేళవింపుతో జెల్లీలా కనిపిస్తూ తెగ నోరూరిస్తాయి. మరి తింటున్నారా? ఎందుకంటే... ఈ పండ్లు మనకి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలని అందిస్తాయి.

  • చినుకులు మొదలయ్యాయి. వాటితోపాటే బోలెడు ఇన్‌ఫెక్షన్లూ పలకరిస్తాయి. వాటి బారిన పడొద్దంటే రోగనిరోధకత పెంచుకోవాల్సిందే. లిచీలో విటమిన్‌- సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీని పెంచడంలో సాయపడుతుంది.
  • బి విటమిన్లు, ఫ్లావనాయిడ్లు సమృద్ధిగా ఉంటాయి. రక్తకణాల ఉత్పత్తికి ఇవి సాయపడతాయి. అందుకే నెలసరి మొదలైన అమ్మాయిలకు వీటిని తప్పక ఇవ్వమంటారు. ఇంకా మాంగనీస్, మెగ్నీషియం, కాపర్, ఐరన్, ఫోలేట్‌ వంటి ఖనిజలవణాలకు ఇది మంచి వనరు. పైగా రుచీ బాగుంటుంది. అందుకే ప్రెగ్నెన్సీ సమయంలో తప్పక ఇవ్వాల్సిన పండ్లలో వీటినీ ఒకటిగా చెబుతారు.
  • వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంలోని ఫ్రీరాడికల్స్‌తో పోరాడి, వృద్ధాప్యఛాయలు త్వరగా దరిచేరకుండా కాపాడతాయి.
  • విటమిన్‌-సి నల్లమచ్చలు, హైపర్‌ పిగ్మెంటేషన్‌ని తగ్గిస్తుంది. అందుకే స్కిన్‌కేర్‌ ఉత్పత్తుల్లోనూ దీనికి చోటిస్తారు. పైపూతల కంటే నేరుగా తీసుకోవడం మరింత మేలు కదా! అందుకే తరచూ ఆహారంలో చేర్చుకోండి. పైగా ఈ పండు బరువు తగ్గించడంలోనూ సాయపడుతుంది.
  • ఇది మనసుకి చేసే మేలూ ఎంతో! దీని తీయనైన సువాసన అరోమా థెరపీలా పనిచేస్తుందట. విశ్రాంతి భావన కలిగించి, ఒత్తిడిని దూరం చేస్తుందట. అంటే వీటిని తినడం ద్వారా శరీరానికే కాదు... మనసుకీ మేలు జరిగేలా చేయొచ్చన్న మాట. అయితే ఎంత నచ్చినా వీటినీ పరిమితంగానే తీసుకోవాలి. రోజుకి 7కి మించకుండా తినాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్