అందానికి.. ‘మామిడి’!

కేవలం రుచే కాదు.. ఎన్నో సుగుణాలున్న పండు మామిడి. మోతాదుకు మించకుండా తింటే దీనివల్ల బోలెడన్ని ప్రయోజనాలు చేకూరతాయట! అయితే కేవలం తినడం వల్లే కాదు.. మామిడి పండు గుజ్జును సౌందర్య పోషణలో ఉపయోగించడం వల్ల మెరిసే మోమును మన సొంతం చేసుకోవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు.

Published : 13 Apr 2024 13:24 IST

కేవలం రుచే కాదు.. ఎన్నో సుగుణాలున్న పండు మామిడి. మోతాదుకు మించకుండా తింటే దీనివల్ల బోలెడన్ని ప్రయోజనాలు చేకూరతాయట! అయితే కేవలం తినడం వల్లే కాదు.. మామిడి పండు గుజ్జును సౌందర్య పోషణలో ఉపయోగించడం వల్ల మెరిసే మోమును మన సొంతం చేసుకోవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. మరి, అదెలాగో తెలుసుకుందాం రండి..

ముల్తానీ మట్టితో కలిపి..

మామిడిలో ఉన్న సుగుణాల వల్ల ముఖ చర్మం నిగారిస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా మార్చడమే కాదు.. చక్కటి మెరుపునూ అందిస్తుంది. దీనికోసం ఒక మామిడి పండు నుంచి తీసిన గుజ్జును తీసుకోవాలి. దీనికి సమపాళ్లలో ముల్తానీ మట్టిని కలిపి, మెత్తని పేస్ట్‌లా చేసుకొని, దాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. అలా పావు గంట పాటు ఉంచుకొని ఆపై గుండ్రంగా మసాజ్ చేసుకుంటూ చల్లని నీటితో ప్యాక్ తొలగించుకోవాలి. ఇలా తరచూ చేయడం వల్ల ఆశించిన ఫలితం వస్తుంది.

ఓట్‌మీల్ తోనూ..

ఓట్‌మీల్ మన ఆరోగ్యానికే కాదు.. చర్మానికి కూడా మేలు చేస్తుంది. దీనికి మామిడి పండు గుజ్జును చేరిస్తే ఆ ప్రయోజనాలు మరింతగా పెరుగుతాయి. దీనికోసం ఏడెనిమిది బాదం పప్పులను నీటిలో నానబెట్టి పొట్టు తీసి, వాటికి రెండు టీస్పూన్ల పాలు, కొద్దిగా ఓట్స్, నీళ్లు, ముల్తానీ మట్టి, ఒక మామిడి పండు గుజ్జు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని పావు గంట పాటు ఉంచుకొని కడిగేస్తే సరిపోతుంది. దీన్ని వారానికి రెండుసార్లు వేసుకుంటే ముఖం మెరిసిపోతుంది.

ట్యాన్‌కి టాటా..

ఎండాకాలంలో ఎక్కువగా ఎదురయ్యేది ట్యాన్ సమస్య. దీనికి వేసవిలో ఎక్కువగా దొరికే మామిడి చక్కగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం మామిడి పండు గుజ్జులో నాలుగు టేబుల్ స్పూన్ల శెనగ పిండి, నాలుగైదు బాదం పప్పుల పొడి, తేనె కలుపుకొని.. ఈ మిశ్రమాన్ని ఎండ వల్ల నల్లగా మారిన చర్మంపై అప్లై చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ట్యాన్ తొలగిపోతుంది. తరచూ ఈ ప్యాక్‌ వేసుకోవడం వల్ల చర్మం నల్లగా మారకుండా కాపాడుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్