వెన్నెల లోకానికి.. మనం!

నాసా చంద్రుడిపైకి పంపిస్తున్న మానవ సహిత అంతరిక్ష నౌకకు క్యాథరిన్‌ లూడెర్స్‌ నేతృత్వం వహించనున్నారు. దీంతో ఈ బాధ్యతలు అందుకుంటున్న తొలి మహిళగా చరిత్రకెక్కనున్నారీమె.

Updated : 11 Mar 2023 04:24 IST

తొలి అడుగు

నాసా చంద్రుడిపైకి పంపిస్తున్న మానవ సహిత అంతరిక్ష నౌకకు క్యాథరిన్‌ లూడెర్స్‌ నేతృత్వం వహించనున్నారు. దీంతో ఈ బాధ్యతలు అందుకుంటున్న తొలి మహిళగా చరిత్రకెక్కనున్నారీమె.

అంతరిక్షయాత్రల్లో మహిళల భాగస్వామ్యం ఉన్నా.. ఇంతవరకూ చంద్రుడిపై కాలుమోపలేదు. తాజాగా క్యాథరిన్‌ ఆ అవకాశాన్ని అందుకున్నారు. నాసాతో ఆమె 30 ఏళ్ల అనుబంధం ఉంది. 2026లో చంద్రుడిపైకి ప్రయాణించనున్న మానవ సహిత అంతరిక్ష నౌకకు ఈమె నేతృత్వం వహించనున్నారు. 

గర్వంగా..  నాసాను గతంలో ‘బాయ్స్‌ క్లబ్‌’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు క్యాథరిన్‌. అలాంటామె ఈ అవకాశాన్ని ఎలా దక్కించుకున్నారంటే... మొదట్లో ఆమె కుటుంబం టోక్యోలో స్థిరపడింది. దాంతో ఈమె బాల్యమంతా అక్కడే గడిచింది. తండ్రితో కలిసి ‘అపోలో 11 ఆన్‌ ది మూన్‌’ కార్యక్రమానికి వెళ్లినప్పుడు తొలిసారిగా క్యాథరిన్‌కు అంతరిక్షయాత్రలపై ఆసక్తి కలిగింది. ‘ఇంజినీరింగ్‌ చదువుతున్నప్పుడే పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలకు తల్లినయ్యా. 1992లో నాసాలో క్వాలిటీ ఇంజినీర్‌ ఉద్యోగాన్ని సంపాదించా. 1993లో తిరిగి బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌, 1999లో న్యూ మెక్సికో విశ్వవిద్యాలయం నుంచి ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌లో మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ చేశా. ఇప్పటివరకు నాసాలో పలు కీలక బాధ్యతలను నిర్వర్తించా. స్పేస్‌ ఎక్స్‌, బోయింగ్‌ టీమ్స్‌తో కలిసి పనిచేశా. ఇప్పుడు మానవ సహిత అంతరిక్ష నౌకకు నేతృత్వం వహించే అవకాశాన్ని అందుకున్నందుకు గర్వంగా ఉంది’ అని చెబుతున్నారీమె.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్