గోళ్లు విరిగిపోతున్నాయా..?

శారీరక సౌందర్యంలో గోళ్లు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే నెయిల్‌ ఆర్ట్‌, నెయిల్‌ జ్యుయలరీ.. అంటూ గోళ్లకు కూడా అదనపు సొబగులద్దుతుంటాం. ఈ క్రమంలో గోళ్లను అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంతో అవసరం.

Published : 05 Jun 2024 21:22 IST

శారీరక సౌందర్యంలో గోళ్లు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే నెయిల్‌ ఆర్ట్‌, నెయిల్‌ జ్యుయలరీ.. అంటూ గోళ్లకు కూడా అదనపు సొబగులద్దుతుంటాం. ఈ క్రమంలో గోళ్లను అందంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంతో అవసరం. దీనికోసం కొన్ని సహజసిద్ధమైన చిట్కాలు ఉపయోగపడతాయంటున్నారు సౌందర్య నిపుణులు.

తేమను అందించాలి..

గోళ్లు పొడిబారినట్లు కనిపించడానికి తేమను కోల్పోవడం కూడా ఒక కారణం కావచ్చు. దీనివల్ల నిర్జీవంగా కనిపించడమే కాదు.. క్రమంగా పెళుసుబారడం, విరిగిపోవడం వంటి సమస్యలు కూడా ఎదురవుతాయి. కాబట్టి వాటికి తగినంత తేమను అందించడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో పెట్రోలియం జెల్లీ లేదంటే మాయిశ్చరైజర్‌ను గోరు మొదలు (క్యుటికల్) చుట్టూ పూసి, చేతులకు కాటన్‌ గ్లౌజుల్ని ధరించాలి. రాత్రంతా ఇలా ఉంచుకొని ఉదయాన్నే శుభ్రం చేసుకోవాలి. ఈవిధంగా తరచూ చేయడం వల్ల గోళ్లు తిరిగి తేమను సంతరించుకుంటాయి.

విరిగిపోతున్నాయా..?

గోళ్లు నిర్జీవమై, పొడిబారిపోయి విరిగిపోతున్నాయా? అయితే విటమిన్‌ ‘ఇ’ నూనెను తప్పనిసరిగా వాడాల్సిందే. కొన్ని చుక్కల విటమిన్‌ ‘ఇ’ నూనెను గోరుపై, గోరు మొదట (క్యుటికల్ వద్ద) వేసి కాసేపు అలాగే ఉంచాలి. ఇలా క్రమంగా చేయడం వల్ల గోళ్లకు రక్తప్రసరణ సరిగ్గా జరిగి.. కొద్ది రోజుల్లోనే గోళ్లు ఆరోగ్యంగా, అందంగా మారతాయి. అలాగే గోళ్లు పొడిబారిపోయి, విరిగిపోయే సమస్య సైతం తగ్గుముఖం పడుతుంది.

పొడిబారుతున్నాయా..?

పొడిబారిన గోళ్లకు తిరిగి జీవం పోయడానికి ఆలివ్ నూనె ఎంతగానో దోహదం చేస్తుంది. ఈక్రమంలో కొద్దిగా ఆలివ్‌ నూనె తీసుకొని కనీసం పదిహేను నిమిషాల పాటు గోళ్లను అందులో ముంచి ఉంచాలి. ఇలా నెల రోజుల పాటు వారానికోసారి, తర్వాత వారానికి రెండుసార్లు చొప్పున చేయడం ద్వారా డ్యామేజ్ అయిన గోళ్లు తిరిగి జీవం పోసుకుంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్