అందాన్ని పెంచే నూనెలు!

అందాన్ని పెంపొందించుకోవడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. ఇంట్లో పాటించే చిట్కాలతో పాటు పార్లర్‌లో ఫేషియల్స్‌, క్లెన్సింగ్‌, బ్లీచింగ్‌.. వంటివి చేయించుకుంటాం. కానీ మీరెప్పుడైనా సహజసిద్ధమైన నూనెల్ని ఉపయోగించారా? ఎందుకంటే ఇవి చర్మానికి....

Published : 08 Nov 2022 20:55 IST

అందాన్ని పెంపొందించుకోవడానికి మనం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. ఇంట్లో పాటించే చిట్కాలతో పాటు పార్లర్‌లో ఫేషియల్స్‌, క్లెన్సింగ్‌, బ్లీచింగ్‌.. వంటివి చేయించుకుంటాం. కానీ మీరెప్పుడైనా సహజసిద్ధమైన నూనెల్ని ఉపయోగించారా? ఎందుకంటే ఇవి చర్మానికి పోషణనందించి లోలోపలి నుంచి చర్మానికి మెరుపును అందిస్తాయి. తద్వారా చర్మం మరింత ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఇంతకీ అందాన్ని సంరక్షించే న్యాచురల్‌ ఆయిల్స్‌ ఏంటి? వాటివల్ల కలిగే ప్రయోజనాలేంటి?? రండి తెలుసుకుందాం..

రోజ్‌ ఆయిల్

పొడి చర్మం, సున్నితమైన చర్మం కలిగిన వారికి రోజ్‌ ఆయిల్‌ బాగా నప్పుతుంది. కొంతమందికి చిన్న వయసులోనే చర్మం ముడతలు పడిపోతూ ఉంటుంది. ఇలా జరగడానికి చర్మ కణాలు దెబ్బతినడం కూడా కారణం కావచ్చు. రోజ్‌ ఆయిల్‌లోని యాస్ట్రింజెంట్‌ గుణాలు దెబ్బతిన్న చర్మ కణాలను రిపేర్‌ చేస్తాయి. అలాగే ఈ నూనెలో ఉన్న యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్‌ గుణాలు ఫ్రీరాడికల్స్‌ని తొలగించి చర్మం ముడతలు పడకుండా కాపాడతాయి. ఫలితంగా చర్మం ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తుంది.

చందనం నూనె

చందనం నూనెతో ముఖంపై ఏర్పడిన ముడతలు, గీతలను తొలగించుకోవచ్చు. అలాగే చందనంలో ఉన్న పోషకాలు చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. దీన్ని కేవలం చర్మానికే కాకుండా జుట్టుకి కూడా రాసుకోవచ్చు. ఫలితంగా వెంట్రుకలు మృదువుగా మారడంతో పాటు నల్లగా నిగనిగలాడతాయి.

యూకలిప్టస్‌ నూనె

అందం విషయంలో దాదాపు మహిళలందరూ ఎదుర్కొనే సమస్య మొటిమలు. వీటిని తగ్గించడంలో యూకలిప్టస్‌ నూనె ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీనిలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాల కారణంగా చర్మానికి బ్యాక్టీరియా వల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకకుండా కాపాడుతుంది.

క్యారట్‌ సీడ్‌ నూనె

క్యారట్‌ సీడ్‌ నూనెలో ఉన్న కెరోటినాయిడ్స్‌ ఎండ ప్రభావానికి గురైన చర్మాన్ని తిరిగి మామూలు స్థితికి తీసుకొస్తాయి. అలాగే దీనిలో ఉండే డీటాక్సిఫికేషన్‌ గుణాల వల్ల మొటిమలు తగ్గుముఖం పట్టడంతో పాటు ఎగ్జిమా, సొరియాసిస్‌ లాంటి చర్మ వ్యాధుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

అవకాడో నూనె

అవకాడో నూనెలో విటమిన్లు ‘ఎ’, ‘ఇ’ ఉంటాయి. ఇవి చర్మానికి పోషణనిచ్చి ఛాయ పెరిగేలా చేస్తాయి. అలాగే ఈ నూనెలోని పోషకాలు శరీరంలో కొలాజెన్‌ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఫలితంగా చర్మం ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తుంది. అలాగే ఈ నూనెతో మర్దన చేసుకోవడం వల్ల వయసు ప్రభావం చర్మంపై పడకుండా జాగ్రత్తపడచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్