అక్కడ అవాంఛిత రోమాలా?

అవాంఛిత రోమాలు.. యుక్తవయసులోకొచ్చిన అమ్మాయిల్లో ఈ సమస్య సహజమే! అయితే కొంతమందిలో ఈ రోమాలు చనుమొనల వద్ద కూడా పెరుగుతుంటాయి. హార్మోన్ల అసమతుల్యత, పీసీఓఎస్ వంటివి ఇందుకు కారణం కావచ్చంటున్నారు నిపుణులు.

Published : 22 Nov 2023 20:14 IST

అవాంఛిత రోమాలు.. యుక్తవయసులోకొచ్చిన అమ్మాయిల్లో ఈ సమస్య సహజమే! అయితే కొంతమందిలో ఈ రోమాలు చనుమొనల వద్ద కూడా పెరుగుతుంటాయి. హార్మోన్ల అసమతుల్యత, పీసీఓఎస్ వంటివి ఇందుకు కారణం కావచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో వైద్యుల్ని సంప్రదించి వాళ్ల సూచనలు పాటించడంతో పాటు కొన్ని ఇంటి చిట్కాలు కూడా ఈ సమస్యకు పరిష్కారం చూపుతాయంటున్నారు.

గుడ్డుతో ఇలా!

ఒక గుడ్డులోని తెల్లసొన, టేబుల్‌స్పూన్‌ చక్కెర, అర టీస్పూన్ కార్న్‌ఫ్లోర్‌.. ఈ మూడింటినీ ఒక బౌల్‌లోకి తీసుకొని బాగా గిలక్కొట్టాలి. తద్వారా ఇది మృదువైన పేస్ట్‌లా తయారవుతుంది. ఇప్పుడు దీన్ని సమస్య ఉన్న చోట రోమాలు పెరిగే దిశలో అప్లై చేయాలి. కాసేపటి తర్వాత ఇది గట్టిపడుతుంది. అప్పుడు దీన్ని వ్యతిరేక దిశలో లాగేస్తే అవాంఛిత రోమాలు తొలగిపోతాయి.

ఈ స్క్రబ్‌తో..

ఒక చిన్న గిన్నెలో టేబుల్‌స్పూన్‌ పసుపు తీసుకోవాలి. దీనికి టీస్పూన్‌ పాలు జత చేస్తూ పేస్ట్‌లా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట రోమాలు పెరిగే దిశలో అప్లై చేసుకోవాలి. ఇది పూర్తిగా ఆరిపోయాక వేళ్లను తడి చేసుకొని వ్యతిరేక దిశలో గుండ్రంగా రుద్దాలి. ఆపై చల్లటి నీటితో కడిగేసుకుంటే సరిపోతుంది. ఇలా వారానికి రెండుమూడు సార్లు చేస్తే క్రమంగా అవాంఛిత రోమాల పెరుగుదల మందగిస్తుంది.

బొప్పాయి-పసుపుతో..

బాగా పండిన ఒక బొప్పాయి పండును గిన్నెలోకి తీసుకొని మ్యాష్‌ చేయాలి. ఇందులో టీస్పూన్‌ పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్న చోట అప్లై చేసి మృదువుగా రుద్దాలి. ఆపై చల్లటి నీళ్లతో కడిగేసుకోవాలి. ఇదే పద్ధతిని వారానికి రెండుమూడు సార్లు చేయడం వల్ల.. ఆ ప్రదేశంలో అవాంఛిత రోమాల సమస్య క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్