Published : 23/12/2022 00:30 IST

పగిలిన పెదాలకు వెన్న..

చలి గాలికి పెదాలు పగిలి పోతుంటాయి. దీని పరిష్కారంగా డీహైడ్రేషన్‌ తగ్గించుకుంటూనే అధరాల సంరక్షణపైనా శ్రద్ధ పెట్టాలి. ఆ చిట్కాలే ఇవి.

* నువ్వుల నూనెను కాస్త వేళ్లకు అద్దుకుని పెదాలకు రాసి, మృదువుగా మర్దన చేయండి. కాస్త జిడ్డుగా అనిపించినా కాసేపటికి పెదాలకు తగిన తేమ అంది.. సమస్య దూరమవుతుంది.

* పెదాల పగుళ్లకు వెన్నను మించిన పరిష్కారం లేదు. సమస్య తగ్గడంతో పాటు...అధరాలు లేత గులాబీ రంగులో మెరిసిపోతాయి. చెంచా వెన్నకు చిటికెడు పంచదార చేర్చి సున్నితంగా స్క్రబ్‌ చేయాలి. ఇలా కాసేపు చేస్తే... రక్తప్రసరణ సక్రమంగా జరిగి పెదాలు కాంతిమంతంగా కనిపిస్తాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని