హెయిర్‌ డై.. మచ్చలుపడితే..!

సౌందర్య పోషణలో భాగంగా చాలామంది హెయిర్‌ డైలు వేసుకోవడం కామన్‌. అయితే కొన్ని సందర్భాల్లో అవి చర్మానికి అంటుకుని అక్కడ మచ్చలాగా ఏర్పడుతుంది. ఇక ఎంత రుద్దినా ఓ పట్టాన వదలవు. అయితే ఇలాంటి మచ్చల్ని తొలగించుకోవడానికి ఇంట్లోనే కొన్ని సహజసిద్ధమైన చిట్కాలున్నాయంటున్నారు సౌందర్య నిపుణులు.

Published : 04 May 2024 12:20 IST

సౌందర్య పోషణలో భాగంగా చాలామంది హెయిర్‌ డైలు వేసుకోవడం కామన్‌. అయితే కొన్ని సందర్భాల్లో అవి చర్మానికి అంటుకుని అక్కడ మచ్చలాగా ఏర్పడుతుంది. ఇక ఎంత రుద్దినా ఓ పట్టాన వదలవు. అయితే ఇలాంటి మచ్చల్ని తొలగించుకోవడానికి ఇంట్లోనే కొన్ని సహజసిద్ధమైన చిట్కాలున్నాయంటున్నారు సౌందర్య నిపుణులు. మరి అవేంటో తెలుసుకుందామా..

⚛ వెనిగర్‌లో ముంచిన కాటన్ బాల్‌తో మచ్చ పడిన చోట రుద్దడం వల్ల అక్కడి మృత చర్మం తొలగిపోయి, మచ్చ పడిన ప్రదేశం తిరిగి కాంతివంతమవుతుంది.

⚛ నిమ్మకాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక ముక్కను తీసుకొని దాంతో మచ్చ పడిన చోట నెమ్మదిగా రుద్దాలి. కాసేపు అలాగే ఉంచిన తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.

⚛ దుస్తులపై పడిన మరకల్ని తొలగించడానికి మనం డిటర్జెంట్ ఉపయోగిస్తుంటాం. అయితే దీంతో చర్మంపై పడిన డై మచ్చల్ని కూడా పోగొట్టచ్చు. ఇందుకోసం కాస్త డిటర్జెంట్‌ని మచ్చ పడిన చోట రాసి చేతివేళ్లతో నెమ్మదిగా రుద్దాలి. ఆపై గోరువెచ్చటి నీటిలో ముంచిన కాటన్ క్లాత్‌తో ఆ ప్రదేశాన్ని సబ్బు పోయే దాకా శుభ్రం చేస్తే సరిపోతుంది.

⚛ బేబీ ఆయిల్‌తో పాటు కొన్ని ఎసెన్షియల్ నూనెలు కూడా డై మచ్చను తొలగించడంలో సహాయపడతాయి. వీటిలో ఏదైనా కాస్త నూనెను తీసుకొని దాన్ని మచ్చపై అప్లై చేసి చేతి మునివేళ్లతో రుద్దాలి. కొంతసేపటి తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.

అయితే ప్రస్తుతం చర్మానికి అంటినా వెంటనే తొలగిపోయే హెయిర్ డైలు కూడా వస్తున్నాయి. సాధ్యమైనంతవరకు ఇలాంటి వాటిని ఎంచుకోవడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్