చిన్నారులకు ఇవి కలిపి పెడుతున్నారా?

తాజా పండ్లు, కూరగాయల్లో ఉండే పోషకాలు సంపూర్ణ ఆరోగ్యాన్ని మన సొంతం చేస్తాయి. అయితే వీటిని చిన్నారులకు పెట్టే విషయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలంటున్నారు పోషకాహార నిపుణులు.

Published : 25 Nov 2023 12:53 IST

తాజా పండ్లు, కూరగాయల్లో ఉండే పోషకాలు సంపూర్ణ ఆరోగ్యాన్ని మన సొంతం చేస్తాయి. అయితే వీటిని చిన్నారులకు పెట్టే విషయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాలంటున్నారు పోషకాహార నిపుణులు. ముఖ్యంగా కొన్ని పండ్లు, కూరగాయలను కలిపి ఒకేసారి సలాడ్‌గా పిల్లలకు అందించకూడదని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వీటి కారణంగా పిల్లల్లో పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందట!మరి, పండ్లు-కాయగూరల్లో వేటిని వేటితో కలిపి చిన్నారులకు అందించకూడదో తెలుసుకుందాం రండి..

వీటిని కలపకూడదు..

కమలాఫలం, క్యారట్

ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల చిన్నారుల్లో గుండెలో మంట, వికారంగా అనిపించడం, మూత్రవ్యవస్థకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. కొన్ని సందర్భాల్లో వీటి ముప్పు పెరిగే అవకాశమూ ఉంటుందట!

బొప్పాయి, నిమ్మ

వీటిని కలిపి తినడం వల్ల హెమోగ్లోబిన్ విచ్ఛిన్నమయ్యే అవకాశం ఉంటుంది. ఫలితంగా చిన్నారులు రక్తహీనతకు గురి కావచ్చు. ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ రెండింటినీ కలిపి చిన్నారులకు పెట్టకపోవడం ఉత్తమం.

జామ, అరటి

చిన్నారులకు కలిపి పెట్టకూడని పండ్లలో జామ, అరటి కూడా ఉన్నాయి. వీటిని ఒకే సమయంలో తినడం వల్ల చిన్నారుల్లో జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. తలనొప్పి, కడుపునొప్పి, వికారంగా కూడా అనిపించచ్చు.

కమలాఫలం, పాలు

చిన్నారులకు ఈ రెండింటినీ ఒకేసారి ఆహారంగా ఇస్తే.. వారిలో జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. కమలాఫలమే కాదు.. దాన్నుంచి తీసిన రసాన్ని కూడా పాలు తాగే ముందు, తర్వాత ఇవ్వకూడదట!

పైనాపిల్, పాలు

పైనాపిల్‌లో ఉండే బ్రోమెలైన్‌ అనే పదార్థం పాలతో కలిసినప్పుడు ఆ మిశ్రమం విషపూరితంగా మారుతుంది. దీని కారణంగా తలనొప్పి, కడుపునొప్పి వస్తాయి. అలాగే పలు జీర్ణ సంబంధిత సమస్యలూ తలెత్తుతాయట! ఒక్కోసారి వాంతులు, విరేచనాలు కూడా అవ్వచ్చంటున్నారు నిపుణులు. అందుకే ఈ రెండూ కలపకూడదంటున్నారు.

వీటిని కలపొచ్చు!

ఒకే రకమైన స్వభావం/గుణాలున్న పండ్లను కలిపి ఆహారంగా అందించడం ద్వారా చిన్నారుల్లో జీర్ణసంబంధిత సమస్యలు, ఇతర అనారోగ్యాలు తలెత్తకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో పీచ్, యాపిల్, తర్బూజా, పుచ్చ, ఫిగ్, ఖర్జూరం.. వంటివి కలిపి తినొచ్చు.

నారింజ, కమలాఫలం, బత్తాయి, నిమ్మ, కివీ, ద్రాక్ష, పైనాపిల్, చెర్రీ, క్రాన్‌బెర్రీ, ప్లమ్.. వంటివి ఆమ్ల గుణాలున్న పండ్ల జాబితాలోకి వస్తాయి. వీటిని కలిపి చిన్నారులకు ఆహారంగా అందించచ్చు.

మామిడి, రాస్బెర్రీ, స్ట్రాబెర్రీ, గ్రీన్ యాపిల్.. వంటివీ కలిపి పిల్లలకు అందించచ్చు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్