మూడు నెలల నుంచి నెలసరి రావట్లేదు. ఎలా?

హలో మేడం. నా వయసు 36. నా ఎడమ వైపు రొమ్ములో గడ్డ ఉంది. దానివల్ల నొప్పి కూడా వచ్చేది. డాక్టర్‌ని కలిస్తే మమోగ్రామ్‌ చేయించుకోమన్నారు. రిపోర్ట్‌లో ఫైబ్రోఎడినోమా అని వచ్చింది. డాక్టర్‌ Novex Tablets మూడు నెలల పాటు వాడమన్నారు. ట్యాబ్లెట్స్‌ వాడుతుంటే పిరియడ్స్‌ ఇర్రెగ్యులర్‌....

Published : 26 Jun 2022 10:29 IST

హలో మేడం. నా వయసు 36. నా ఎడమ వైపు రొమ్ములో గడ్డ ఉంది. దానివల్ల నొప్పి కూడా వచ్చేది. డాక్టర్‌ని కలిస్తే మమోగ్రామ్‌ చేయించుకోమన్నారు. రిపోర్ట్‌లో ఫైబ్రోఎడినోమా అని వచ్చింది. డాక్టర్‌ Novex Tablets మూడు నెలల పాటు వాడమన్నారు. ట్యాబ్లెట్స్‌ వాడుతుంటే పిరియడ్స్‌ ఇర్రెగ్యులర్‌ అయ్యాయి. డాక్టర్‌కి చెబితే ట్యాబ్లెట్స్‌ వల్లే అలా జరుగుతుందన్నారు. దాదాపు మూడు నెలల నుంచి నాకు పిరియడ్‌ రాలేదు. మళ్లీ డాక్టర్‌ని కలిస్తే Mensovit Capsules వాడమన్నారు. పది రోజుల్లోపు పిరియడ్‌ వస్తుందని చెప్పారు. ఇది నిజమేనా? మళ్లీ నా పిరియడ్స్‌ రెగ్యులర్‌ కావాలంటే నేనేం చేయాలి? నేనేమైనా పరీక్షలు చేయించుకోవాలా? - ఓ సోదరి

జ. ఫైబ్రోఎడినోమా అన్నది సాధారణమైన గడ్డ. అయితే దాని సైజ్‌ ఎంత ఉందో మీరు రాయలేదు. దాని గురించి మీరు తరచూ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. మీ డాక్టర్‌ చెప్పినట్లు Novex Tabletsవాడడం వల్ల పిరియడ్స్‌ ఇర్రెగ్యులర్‌ అవుతాయి. తిరిగి పిరియడ్స్‌ సక్రమంగా రావడానికి కొంత సమయం పట్టచ్చు. అందుకే కొన్నాళ్లు చూసి ఒకవేళ పిరియడ్‌ రాకపోతే గైనకాలజిస్ట్‌ను సంప్రదించి వివరంగా అల్ట్రాసౌండ్‌ స్కాన్‌, హార్మోన్ల పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్