బొప్పాయితో మెరిసే చర్మం!

ఫేషియల్‌ అంటే మనలో చాలామందికి పార్లరే గుర్తొస్తుంది. కానీ ఆ అవసరం లేకుండా ఇంట్లో లభించే పదార్థాలు, పండ్లతోనే స్వయంగా ఫేషియల్‌ చేసుకొని అందంగా మెరిసిపోవచ్చంటున్నారు నిపుణులు. అలాంటిదే బొప్పాయితో చేసుకొనే ఈ ఫేషియల్.

Published : 23 Mar 2024 12:26 IST

ఫేషియల్‌ అంటే మనలో చాలామందికి పార్లరే గుర్తొస్తుంది. కానీ ఆ అవసరం లేకుండా ఇంట్లో లభించే పదార్థాలు, పండ్లతోనే స్వయంగా ఫేషియల్‌ చేసుకొని అందంగా మెరిసిపోవచ్చంటున్నారు నిపుణులు. అలాంటిదే బొప్పాయితో చేసుకొనే ఈ ఫేషియల్.

మసాజ్‌ ఇలా!

బాగా పండిన బొప్పాయిపై తొక్క తీసేసి.. ముక్కలుగా కట్‌ చేయాలి. వీటిని మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ గుజ్జును ముఖానికి, మెడకు పట్టించి.. గుండ్రంగా రుద్దుతూ మర్దన చేసుకోవాలి. ఇలా దాదాపు 20 నుంచి 30 నిమిషాల వరకు మృదువుగా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. కావాలనుకుంటే ఈ బొప్పాయి పేస్ట్‌కు టీస్పూన్‌ చొప్పున కలబంద గుజ్జు, తేనె కలుపుకోవచ్చు.

మేని మెరుపుకి!

ఇలా బొప్పాయితో చేసుకొనే ఫేషియల్‌ గోల్డెన్ ఫేషియల్ చేసుకున్నంత ఫలితాన్నిస్తుందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ముఖం మీద ఉండే ట్యాన్ కూడా తగ్గుముఖం పడుతుంది. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేయడం వల్ల ప్రకాశవంతమైన చర్మం మన సొంతమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్