ఇవి జడలల్లేస్తాయ్‌!

ఏ జడైనా వేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది.. అదే మైక్రో బ్రెయిడ్స్‌ వేసుకోవాలంటే మరింత సమయం వెచ్చించాల్సిందే! ఇలాంటప్పుడు ‘హెయిర్‌ బ్రెయిడర్‌ మెషీన్‌’ ఉపయోగిస్తే చిటికెలో పని పూర్తవుతుంది.

Updated : 07 Oct 2023 17:23 IST

మూడు పాయలు, నాలుగు పాయలు, రెండు పాయలతో వేసే ట్విస్ట్‌ బ్రెయిడ్‌.. ఇలా సందర్భానికి తగినట్లుగా వివిధ రకాలుగా స్టైలిష్‌ జడలు వేసుకోవడానికి చాలామంది ఇష్టపడతారు. ఇక మైక్రో బ్రెయిడ్స్‌ వేసుకొని.. వాటితోనూ కొప్పును స్టైలిష్‌గా తీర్చిదిద్దుకుంటుంటారు కొందరు. అయితే ఏ జడైనా వేసుకోవడానికి కాస్త సమయం పడుతుంది.. అదే మైక్రో బ్రెయిడ్స్‌ వేసుకోవాలంటే మరింత సమయం వెచ్చించాల్సిందే! ఇలాంటప్పుడు ‘హెయిర్‌ బ్రెయిడర్‌ మెషీన్‌’ ఉపయోగిస్తే చిటికెలో పని పూర్తవుతుంది.

ఆటోమేటిక్‌గా జడలు వేసే ఈ మెషీన్‌ ప్రస్తుతం మార్కెట్లో విభిన్న డిజైన్లలో దొరుకుతోంది. రెండు పాయలు, మూడు పాయలు, నాలుగు పాయలతో.. వేసుకునేలా వేర్వేరు మోడల్స్‌లో ఇది లభ్యమవుతోంది. ముందుగా పాయల్ని విడదీసి.. చిన్న స్టిక్‌కు ఉన్న హుక్స్‌లో పెట్టి.. దాన్ని కిందికి లాగితే.. ఈ మెషీన్‌కి ఉన్న రంధ్రాల్లోకి ఆ పాయలు చేరతాయి. ఆపై ఈ మెషీన్‌కి ఉన్న బటన్‌ నొక్కితే చాలు.. అదే ఆటోమేటిక్‌గా జడలల్లేస్తుంది. అవసరమైతే.. ఈ రంధ్రాల్లో పాయలతో పాటు సన్నటి రిబ్బన్స్‌, జుట్టు అలంకరణలో భాగంగా ఉపయోగించే రంగురంగుల దారాలు.. వంటివి అమర్చితే.. అల్లే క్రమంలో అవీ జడలో భాగంగా కలిసిపోతాయి.. ఫలితంగా జడ అందం పెరుగుతుంది. ఇలా అల్లిన జడల్ని.. రంగురంగుల డ్రెడ్‌లాక్‌ బ్రీడ్స్‌, హెయిర్‌ కఫ్స్‌తో అలంకరిస్తే ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవచ్చు. చిన్నారులూ ఈ తరహా హెయిర్‌స్టైల్స్‌ని ఇష్టపడుతుంటారు. ఇలా సులభంగా జడలల్లే ఈ బ్రెయిడ్‌ మెషీన్‌లో బ్యాటరీతో నడిచేవి, ఛార్జింగ్‌ చేసుకునేవి, ఎలక్ట్రిక్‌వి.. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్నాయి. అలాంటి హెయిర్‌స్టైల్‌ టూల్‌పై మీరూ ఓ లుక్కేసేయండి!

Photos: Amazon.in

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్