Holi: హోలీ ఆడారా?

పెద్దవాళ్లు కూడా చిన్నపిల్లలుగా మారి చేసుకొనే పండగ హోలీ! ఆడినంతసేపూ బాగానే ఉంటుంది.. తర్వాతే ఇబ్బంది. ముఖానికి ఏదోక మాయ చేసేయొచ్చు.

Published : 10 Mar 2023 00:01 IST

పెద్దవాళ్లు కూడా చిన్నపిల్లలుగా మారి చేసుకొనే పండగ హోలీ! ఆడినంతసేపూ బాగానే ఉంటుంది.. తర్వాతే ఇబ్బంది. ముఖానికి ఏదోక మాయ చేసేయొచ్చు. జుట్టే గడ్డిలా తయారవుతుంది. మీదీ అదే పరిస్థితా? షాంపూలకి కొన్ని చేరిస్తే సరి!

* చెంచా చొప్పున గ్లిజరిన్‌, వెనిగర్‌, మూడు స్పూన్ల పాలు, సమాన పరిమాణాల్లో షాంపూ, కండిషనర్‌ (మీ జుట్టుకు సరిపడినంత) తీసుకొని బాగా కలపాలి. దాన్ని కుదుళ్ల నుంచి, వెంట్రుకల చివర వరకు పట్టించండి. 20 నిమిషాలయ్యాక గోరు వెచ్చని నీటితో కడిగేస్తే సరి. మాడుకు అంటిన రసాయనాలు వదలడమే కాదు.. పోషణా అందుతుంది.

* ఒక గుడ్డు తెల్లసొనకు మూడు స్పూన్ల పెరుగు, స్పూను తేనె కలిపి తలంతా పట్టించాలి. అరగంటయ్యాక షాంపూనకు కొన్ని చుక్కల ఆపిల్‌ సిడార్‌ వెనిగర్‌ కలిపి, తలస్నానం చేస్తే సరి. కుదుళ్లకు కావాల్సిన పోషకాలు అందుతాయి.

* కలబంద గుజ్జును కుదుళ్ల నుంచి చివర్ల వరకూ పట్టించాలి. పావుగంట అయ్యాక గోరు వెచ్చని నీటితో రసాయనాల్లేని షాంపూతో తలస్నానం చేయాలి. షాంపూ నీళ్లలో 3-4 ఇ విటమిన్‌ ఆయిల్‌ చుక్కలు కలపాలి. కురులకు కావాల్సిన తేమ అందడమే కాదు.. కుదుళ్లూ బలంగా అవుతాయి.

* షాంపూ నీళ్లలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి, తలస్నానం చేయండి. నిమ్మలోని గుణాలు రసాయనాల పని పట్టడమే కాదు.. చుండ్రునీ దరి చేరనీయవు. అయితే చివర్లో మంచి కండిషనర్‌ని వాడటం తప్పనిసరి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్