చర్మంపై ముడతలు.. ఈ పొరపాట్లు చేస్తున్నారేమో?!

చిన్న వయసులో ఉన్నా కొంతమంది ముఖం ముడతలు పడుతుంది. దీనివల్ల వారు వయసు మళ్లిన వారిలా కనిపిస్తుంటారు. ముఖంపై ముడతలు రావడానికి కాలుష్యం, ఒత్తిడి, పోషకాహార లోపం ఇలా ఏదైనా కారణం కావచ్చు....

Published : 18 May 2024 12:42 IST

చిన్న వయసులో ఉన్నా కొంతమంది ముఖం ముడతలు పడుతుంది. దీనివల్ల వారు వయసు మళ్లిన వారిలా కనిపిస్తుంటారు. ముఖంపై ముడతలు రావడానికి కాలుష్యం, ఒత్తిడి, పోషకాహార లోపం ఇలా ఏదైనా కారణం కావచ్చు. వీటికి తోడు దైనందిన జీవితంలో మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లు కూడా ఈ ముడతలకు కారణమవుతాయంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం రండి...

మోతాదుకు మించి వద్దు..
చక్కెర ఎక్కువగా తీసుకోవడం కూడా చర్మం ముడతలు పడడానికి కారణమవుతుంటుంది. మోతాదుకు మించి చక్కెరను తీసుకోవడం వల్ల శరీరంలో గ్లైకేషన్‌ అనే ప్రక్రియ మొదలవుతుంది. ఫలితంగా చర్మం మృదుత్వాన్ని కోల్పోయి ముడతలు పడడం ప్రారంభిస్తుంది.

వాటిని పూర్తిగా దూరం పెట్టద్దు..
చర్మం అందంగా, మృదువుగా కనిపించడానికి తగిన పరిమాణంలో కొవ్వులు కూడా అవసరమే. అయితే చాలామంది లావవుతామన్న భయంతో కొవ్వు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉంటారు. ఫలితంగా వీటి ద్వారా లభించే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి అందవు. ఈ ఆమ్లాలు చర్మం యవ్వనంగా ఉండేందుకు దోహదపడతాయి. అంతేకాదు.. ఇవి మెదడు చురుగ్గా పని చేయడానికి కూడా తోడ్పడతాయి. అలాగే గుండెను కూడా పదిలంగా కాపాడతాయి. అందుకే కొవ్వు పదార్థాలను కూడా అవసరమైన మేరకు ఆహారంలో చేర్చుకోవాలి.

ఒక పక్కకే నిద్రపోతున్నారా?
ఒక్కోసారి నిద్రపోయే విధానం కూడా చర్మం ముడతలు పడడానికి కారణం కావచ్చు. చాలామందికి ఒక పక్కకే తిరిగి నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఇలా రోజూ ఒకే దిశలో నిద్రపోవడం వల్ల ఆ వైపు ఉన్న చర్మం మృదుత్వాన్ని కోల్పోతుంది. చాలామంది చెంపలను దిండుకు ఆనించి నిద్రపోతుంటారు. అలా కాకుండా తలను ఆన్చి నిద్రపోవాలి. ఎందుకంటే తలగడ వల్ల ముఖ చర్మం ఒత్తిడికి గురై ముడతలు పడే అవకాశం ఉంటుందట!

బ్రాండ్‌ ఒక్కటే సరిపోదు..
చాలామంది సబ్బు బ్రాండ్‌ని బట్టి ఉపయోగిస్తుంటారు. అంతేతప్ప ఆ సబ్బు చర్మానికి సరిపడుతుందా లేదా అని ఆలోచించరు. ఇలా చేయడం వల్ల కూడా ఒక్కోసారి చర్మం ముడతలు పడే అవకాశం ఉంటుందట! కొన్ని రకాల సబ్బులను ఉపయోగించడం వల్ల చర్మం పొడిబారినట్లుగా తయారవుతుంది. అందుకే శరీరతత్వానికి సరిపోయే సబ్బును ఎంచుకోవాలి. ఈ విషయంలో అవసరమైతే సౌందర్య నిపుణులను సంప్రదించడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్