వేసవి తాపాన్ని తరిమేయండిలా..!

మండే ఎండల్లో బయటకు వెళ్లి వచ్చిన తర్వాత వేడి నుంచి ఉపశమనం పొందడానికి కొంతమంది ఐస్‌క్యూబ్‌తో చర్మంపై రుద్దుకుంటూ ఉంటారు. అయితే దీనివల్ల కలిగే ఫలితం తాత్కాలికంగా ఉంటుంది. ఈ ఐస్‌క్యూబ్స్‌కు మరిన్ని సహజసిద్ధమైన పదార్థాలను జత చేస్తే అద్భుతమైన ఫలితాలు, దీర్ఘకాలపు ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయంటున్నారు సౌందర్య నిపుణులు.

Published : 24 Mar 2024 15:53 IST

మండే ఎండల్లో బయటకు వెళ్లి వచ్చిన తర్వాత వేడి నుంచి ఉపశమనం పొందడానికి కొంతమంది ఐస్‌క్యూబ్‌తో చర్మంపై రుద్దుకుంటూ ఉంటారు. అయితే దీనివల్ల కలిగే ఫలితం తాత్కాలికంగా ఉంటుంది. ఈ ఐస్‌క్యూబ్స్‌కు మరిన్ని సహజసిద్ధమైన పదార్థాలను జత చేస్తే అద్భుతమైన ఫలితాలు, దీర్ఘకాలపు ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయంటున్నారు సౌందర్య నిపుణులు.

పాలతో..

పాలు చర్మానికి అవసరమైన తేమను అందించి యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. అంతేకాదు.. మండే వేసవిలో చర్మానికి ఉపశమనం కలిగించడానికి కూడా బాగా ఉపకరిస్తాయి. దీని కోసం ఐస్ ట్రేలో పచ్చిపాలు పోసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఇవి క్యూబ్స్‌గా మారిన తర్వాత బయటకు వెళ్లి వచ్చిన వెంటనే ఒక మిల్క్ క్యూబ్‌తో చర్మంపై రుద్దుకొని చూడండి. చర్మానికి చల్లదనంతో పాటు, తగినంత తేమ కూడా అంది తాజాగా కనిపిస్తుంది. కావాలనుకొంటే రోజూ రాత్రి పడుకొనే ముందు ఒక మిల్క్ క్యూబ్‌తో చర్మంపై మృదువుగా రుద్దుకొని మరుసటి రోజు ఉదయాన్నే చల్లని నీటితో శుభ్రం చేసుకోండి. చర్మం యవ్వనంగా, తాజాగా మారుతుంది.

ముల్తానీ మట్టి..

సౌందర్య సంరక్షణలో భాగంగా వినియోగించే సాధనాల్లో ముల్తానీ మట్టి కూడా ఒకటి. దీన్ని వేసవి తాపం నుంచి ఉపశమనం పొందడానికి కూడా వినియోగించవచ్చు. ఇందుకోసం..
ముల్తానీ మట్టి- 1 చెంచా, రోజ్‌వాటర్- 4 చెంచాలు చొప్పున తీసుకొని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో వేసి డీప్ ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న క్యూబ్స్‌తో చర్మంపై మృదువుగా రుద్దుకొని పది నిమిషాలు లేదా పూర్తిగా ఆరే వరకు ఉండనిచ్చి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల ఎండనుంచి చర్మానికి రక్షణ లభించడం మాత్రమే కాదు.. చర్మం ప్రకాశవంతంగా కూడా మారుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్