మేకప్ లేకపోయినా.. డోంట్ వర్రీ!

వేసవిలో.. ఒకటే చెమట.. చిరాకు.. ఈ క్రమంలో- ప్రతిసారీ బయటకు వెళ్లేటప్పుడు మేకప్ వేసుకోవడం కుదరకపోవచ్చు. ఫలితంగా అందంగా కనబడమని భావిస్తున్నారా?

Published : 28 May 2024 12:54 IST

వేసవిలో.. ఒకటే చెమట.. చిరాకు.. ఈ క్రమంలో- ప్రతిసారీ బయటకు వెళ్లేటప్పుడు మేకప్ వేసుకోవడం కుదరకపోవచ్చు. ఫలితంగా అందంగా కనబడమని భావిస్తున్నారా? మరేం ఫర్వాలేదు.. మేకప్ లేకుండా కూడా అందంగా కనబడటానికి కొన్ని చిట్కాలున్నాయి..

సన్‌స్క్రీన్ రాయండి..
మేకప్ డీటాక్స్‌లో భాగంగా ప్రాథమిక చర్మ సంరక్షణ జాగ్రత్తలను మాత్రం మరవకండి. బయటకు వెళ్తారనగా 15 నిమిషాల ముందు సన్‌స్క్రీన్ లోషన్‌ను రాసుకోండి.

మాయిశ్చరైజర్ వాడండి..
ముఖం చూడడానికి డల్‌గా ఉందని భావిస్తే సాధారణ సమయాల్లో టింటెడ్‌ (ఫౌండేషన్‌ కంటే లేత రంగు) మాయిశ్చరైజర్‌ను వాడొచ్చు. ప్రత్యేక సందర్భాల్లో మాత్రం హై కవరేజ్ ఫౌండేషన్స్‌ను వాడితే సరిపోతుంది.

నిమ్మరసం తాగండి..
ఉదయమే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగండి. దీనివల్ల శరీరంలోని విష పదార్థాలు తొలగిపోతాయి. ఫలితంగా చర్మానికి నిగారింపు వస్తుంది.

ఎక్స్‌ఫోలియేషన్ చేస్తున్నారా?
చర్మంపై మృత కణాలు, పొలుసులుగా ఉండటం వల్ల ముఖం డల్‌గా కనబడుతుంది. దీనికి ఎక్స్‌ఫోలియేషన్ మంచి పరిష్కారం. మీ చర్మం స్వభావాన్ని బట్టి వారానికి రెండు మూడు సార్లు స్క్రబ్‌తో ఎక్స్‌ఫోలియేషన్ చేసుకోండి.

టోనర్ వాడాల్సిందే..
మనం సాధారణంగా టోనర్ వంటివి నిర్లక్ష్యం చేస్తాం. ముఖం కడుక్కున్న తర్వాత టోనర్‌ను వాడాలి. ఇలా చేస్తే ముఖంపై పీహెచ్ స్థాయులు బ్యాలన్స్ అయి చర్మం తాజాగా ఉంటుంది.

8 గంటల నిద్ర తప్పనిసరి!
చర్మం నిగారింపుకి నిద్ర ఎంతగానో తోడ్పడుతుంది. కనీసం ఎనిమిది గంటలు నిద్ర పోవాలి. ఆ సమయంలో మెలటోనిన్ హార్మోన్ విడుదలవుతుంది. వెల్లకిలా పడుకోవడం వల్ల చర్మంపై ముడతలను నివారించొచ్చు.

నీళ్లు తాగుతున్నారా?
చర్మం మృదువుగా, ఆరోగ్యంగా ఉండాలంటే శరీరంలో కావలసినంత తేమ ఉండాలి. కాబట్టి రోజూ తగినంత మొత్తంలో నీరు తాగండి. అందులోనూ వేసవిలో డీహైడ్రేషన్ సమస్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా ఉండటమే గాక వయసు పైబడిన ఛాయలు కూడా దరిచేరవు.

దంతాలు శుభ్రంగా..
ముఖంపై చెరగని చిరునవ్వు అందాన్ని రెట్టింపు చేస్తుంది. కాబట్టి దంతాలు శుభ్రంగా ఉంచుకోవాలి. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం మరవద్దు.

లిప్‌బామ్ వాడుతున్నారా?
పెదవులకు కూడా మాయిశ్చరైజింగ్, ఎక్స్‌ఫోలియేషన్ అవసరమే. లిప్‌బామ్ వాడుతూ ఉండండి. ఆలివ్ ఆయిల్ వంటి సహజ నూనెలను కూడా పెదాలపై వాడొచ్చు. వారానికి ఒకసారైనా పెదాలను చేతి వేళ్లతో మసాజ్ చేయండి. మసాజ్‌కు ముందు పెదాలను తడి చేయడం మరవద్దు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్