ప్రేమిస్తా.. అందుకే ఆనందం!

‘అసాధ్యం’ అనేదాన్ని నమ్మను నేను. ఏదైనా చేయగలనని నమ్ముతా కాబట్టే.. ఏ సమస్యా పెద్దగా అనిపించదు. పెళ్లి, పిల్లల కారణంగా కెరియర్‌లో వెనకబడిపోతాం అన్నదాన్నీ ఒప్పుకోను.

Published : 07 Feb 2023 00:25 IST

‘అసాధ్యం’ అనేదాన్ని నమ్మను నేను. ఏదైనా చేయగలనని నమ్ముతా కాబట్టే.. ఏ సమస్యా పెద్దగా అనిపించదు. పెళ్లి, పిల్లల కారణంగా కెరియర్‌లో వెనకబడిపోతాం అన్నదాన్నీ ఒప్పుకోను. 21 ఏళ్లకే పెళ్లి. తర్వాత మావారికి యూకేలో ఉద్యోగం వస్తే ఆయన వెంట వెళ్లిపోయా. ఫలానాదే చేస్తానని మడి కట్టుకొని కూర్చోలేదు. ప్రతిదాన్నీ సవాలుగా తీసుకునేదాన్ని. దీనికితోడు మా బాబు ‘నువ్వెప్పుడూ నా చుట్టే ఉండాల్సిన పనిలేదు. నీ కెరియర్‌ చూసుకో’ అని ప్రోత్సహించేవాడు. మావారి అండా ఉండేది. ఇంకేం.. ధైర్యంగా చేయాలనుకున్నది చేసుకుంటూ వెళ్లా. అందరిలాగే నాకూ 24 గంటలే! ఇష్టంగా పని మొదలుపెడతా.. చేసేదాన్ని ప్రేమిస్తా కాబట్టి ఆనందం ఎప్పుడూ నా చుట్టూనే ఉన్నట్లుగా అనిపిస్తుంది. రోజూ గంటైనా బాబుతో గడుపుతా. వారమంతా బిజీగా సాగితే వారాంతాలు మావారికి కేటాయిస్తా. దీంతో బంధాలకు దూరమవుతున్నానన్న భావన ఉండదు. కార్పొరేట్‌ ప్రపంచంలో ‘గ్లాస్‌ సీలింగ్‌’ ఉంటుందని నేను నమ్మను. పోటీతత్వం ఉంటే ఎవరైనా దూసుకెళ్లొచ్చు. మన ఆడవాళ్ల విషయానికి వచ్చేసరికి ఇల్లు, కుటుంబం, పిల్లలు అనే బాధ్యతల్లో ఇరుక్కుపోతాం. చుట్టూ ఉన్నవాళ్లూ ‘సంపాదించేది మగవాళ్లు’ అని ఆమె కెరియర్‌కి ప్రాధాన్యం ఇవ్వరు. ఫలితమే నిర్ణయాత్మక హోదాల్లో ఆడవాళ్లు లేకపోవడం. మరేంటి పరిష్కారం? ముందు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. మీ మాట, ప్రవర్తనల్లో ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించండి. ప్రతి రెండు మూడేళ్లకోసారి మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోండి. సర్దుకుపోక మీ లక్ష్యాలను ఇంట్లోవాళ్ల ముందుంచండి. అప్పుడు అడ్డుకునే బంధనాలేవీ ఉండవు.

- మాధవి పూరీ బుచ్‌, ఛైర్‌పర్సన్‌, సెబీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్