ప్రేమను చూపించండి...

పిల్లలకు ఎన్నో నేర్పించాలనుకుంటాం. కానీ వాళ్లు ఓ పట్టాన.....

Updated : 29 Nov 2022 13:56 IST

పిల్లలకు ఎన్నో నేర్పించాలనుకుంటాం. కానీ వాళ్లు ఓ పట్టాన మాట వినరు. అలాంటప్పుడు   మీరు వాళ్లకు ఆదర్శంగా ఉండేలా చూసుకోండి. అదెలాగో తెలుసుకోండి మరి.

* కొంతమంది పిల్లలకు వ్యాయామం చేయమనీ, చదువుకోమనీ, పోషకాహారం తీసుకోమని చెప్పినా వినరు. అలాంటప్పుడు మీరు వాటిని పాటించి చూపించండి. క్రమంగా వాళ్లు చేయడం మొదలుపెడతారు.
* పిల్లలపై మనకు ప్రేమ ఉన్నా... వ్యక్తం చేస్తే ఎక్కడ మొండికేస్తారోనని ఆలోచించి మౌనంగా ఉండిపోతాం. కానీ నిపుణుల ప్రకారం వాళ్లపై మీకున్న ప్రేమను తెలియజేయాలి. అది మాటలతో
కావచ్చు, చేతలతోనైనా కావచ్చు. కాస్త పెద్ద పిల్లలయినా సరే అప్పుడప్పుడూ దగ్గరకు తీసుకోవడం, భేష్‌ అంటూ భుజం తట్టడం... లాంటివన్నీ మీ ప్రేమను వారికి తెలియజేస్తాయి.
* మనకంటూ బోలెడు పనులు ఉంటాయనేది వాస్తవమే. అయినప్పటికీ పిల్లలతో తరచూ మాట్లాడుతూ ఉండాలి. దానివల్ల వారి గురించి వీలైనంత ఎక్కువగా తెలుసుకోగలుగుతాం. వాళ్లకున్న  సమస్యలూ అర్థమవుతాయి.
* పిల్లలంటే కేవలం చదువూ, వాళ్ల అభిరుచుల్ని సానబెట్టడం మాత్రమే కాదు. వాళ్లతో కలిసి ఆడిపాడటం కూడా. దీనివల్ల మీ ఒత్తిడి తగ్గడమే కాదు, చిన్నారులతో సరదాగా గడిపినవారూ అవుతారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్