అందంగా.. సౌఖ్యంగా..

నాలుగు జీన్సులుంటే చాలు బిందాస్‌గా బతికేయొచ్చు.. అవి గనుక స్కిన్నీ జీన్స్‌ అయితే ఇక చెప్పాల్సిందేముంది.. ఓహో గ్లామర్‌ క్వీన్స్‌మే- అంటున్నారు ఈ తరం అమ్మాయిలు. ఇంతకీ స్కిన్నీ జీన్స్‌ ప్రత్యేకత ఏంటంటే వదులుగా ఉండవు, ముడతలు పడవు.

Published : 03 Jan 2023 00:59 IST

నాలుగు జీన్సులుంటే చాలు బిందాస్‌గా బతికేయొచ్చు.. అవి గనుక స్కిన్నీ జీన్స్‌ అయితే ఇక చెప్పాల్సిందేముంది.. ఓహో గ్లామర్‌ క్వీన్స్‌మే- అంటున్నారు ఈ తరం అమ్మాయిలు.

ఇంతకీ స్కిన్నీ జీన్స్‌ ప్రత్యేకత ఏంటంటే వదులుగా ఉండవు, ముడతలు పడవు. కాళ్లకు అతికినట్టుగా ఉండి సొగసును పెంచుతాయి. స్కిన్నీ జీన్స్‌కు చాలానే పేర్లున్నాయండోయ్‌! స్లిమ్‌ ఫిట్‌ ప్యాంట్లు, డ్రెయిన్‌పైప్స్‌, స్టవ్‌పైప్స్‌, సిగరెట్‌ ప్యాంట్స్‌, పెన్సిల్‌ ప్యాంట్స్‌, టైట్‌ ప్యాంట్స్‌, స్కిన్నీస్‌.. ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్లు పిల్చుకుంటున్నారు. వీటికి కింద వైపు వెడల్పు తక్కువ. అందువల్ల వేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా పాదాల దగ్గర జిప్పర్స్‌ పెడుతున్నారు. స్ట్రెచ్‌ డెనిమ్‌ క్లాత్‌ కనుక సాగే గుణంతో ధరించినప్పుడు సౌకర్యంగా ఉంటుంది.

స్కిన్నీస్‌ మీద స్టైలిష్‌ వెస్ట్రన్‌ టాప్స్‌, ట్రెడిషనల్‌ కుర్తీలు ఏది వేసినా అదుర్సే. అందుకే పిల్లలూ పెద్దలూ కూడా వీటి పట్ల మక్కువ చూపిస్తున్నారు. ఆఫీస్‌వేర్‌గానూ, పార్టీవేర్‌గానూ కూడా మన్ననలు అందుకుంటున్నాయి. సింపుల్‌గా ఉంటూనే సూపర్‌ అనిపించడం, అందుబాటు ధరలో దొరుకుతూ ఆకర్షణీయంగా కనిపించడం వీటి ప్రత్యేకత. ఒక్క మాటలో చెప్పాలంటే కంఫర్ట్‌కి ఇంకో పేరు స్కిన్నీ జీన్స్‌!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్