Published : 24/02/2022 21:12 IST

సింహళ సౌందర్యం రహస్యాలివేనట!

(Photo: Instagram)

కాలమేదైనా అమ్మాయిలకు పలు చర్మ సమస్యలు మాత్రం కామన్. అందులో మొటిమలు, చర్మం పొడిబారిపోయి నిర్జీవమైపోవడం.. వంటివి ఈ కాలపు అమ్మాయిలను మరింతగా వేధిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే వీటిని తక్షణమే తగ్గించుకోవాలనే ఉద్దేశంతో మార్కెట్లో దొరికే వివిధ రకాల క్రీముల్ని రాసుకుంటారు చాలామంది. అది సమస్యను పెంచుకోవడమే తప్ప తగ్గించేందుకు అస్సలు ఉపయోగపడదు. అందుకే ఇలాంటి సమస్యల్ని తగ్గించుకొని తమ అందాన్ని ఇనుమడింపజేసుకోవడానికి తరతరాలుగా వస్తోన్న సహజసిద్ధమైన సౌందర్య పద్ధతుల పైనే ఆధారపడతారట  శ్రీలంకన్ మహిళలు.

వైట్ హెడ్స్‌కి చెక్ పెట్టే వేప!

శ్రీలంకలో ఇంటికో వేపచెట్టు (అక్కడ ఈ చెట్లును 'కొహొంబా'గా పిలుస్తారు) తప్పనిసరిగా ఉంటుందట. అందుకు సౌందర్యపరంగా అది అందించే ఔషధ గుణాలే కారణం. అక్కడి మగువలు వేపను వారి సౌందర్య పద్ధతుల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా వైట్ హెడ్స్‌ని దూరం చేసుకోవడానికి, చర్మం పొడిబారిపోయి పగుళ్లు ఏర్పడినప్పుడు, ఎక్కడైనా గాయాలైనప్పుడు దీన్ని ఉపయోగించి సమస్యను తగ్గించుకోవడం అక్కడి వారికి అలవాటు. ఈ క్రమంలో రెండు టేబుల్‌స్పూన్ల వేప పొడిలో టేబుల్‌స్పూన్ కొబ్బరి నూనె కలిపి పేస్ట్‌లా చేసుకుంటారు. దీన్ని సమస్య ఉన్న చోట అప్త్లె చేసుకొని ఓ పది, పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. వేపలోని యాంటీసెప్టిక్ గుణాలు పొడిబారిన చర్మాన్ని నయం చేయడంతో పాటు వైట్ హెడ్స్ సమస్యను కూడా దూరం చేస్తాయి.

ఛాయను పెంచుకోవడానికి..!

ముఖంపై సూర్యరశ్మి నేరుగా పడడం వల్ల అక్కడ చర్మం కందిపోయినట్లు, చర్మ ఛాయ తగ్గినట్లుగా కనిపించడం సహజం. అలాంటి సమస్య ఎదురైనప్పుడు శ్రీలంకన్ అతివలు ఈ సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్‌ను ఉపయోగించి సమస్యను త్వరిత గతిన తగ్గించుకుంటారు. ఇందుకోసం నాలుగు టేబుల్‌స్పూన్ల కలబంద గుజ్జు, టేబుల్‌స్పూన్ కొబ్బరి నూనె, టేబుల్ స్పూన్ తేనె, రెండు టీస్పూన్ల నిమ్మరసం.. వీటన్నింటినీ మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకుంటారు. ఈ మిశ్రమాన్ని చేతి మునివేళ్ల సహాయంతో ముఖానికి అప్త్లె చేసుకొని కాస్త మర్దన చేసుకుంటారు. అరగంటాగి కడిగేసుకుంటే చక్కటి ఫలితం కనిపిస్తుంది. ఇలా తరచూ చేయడం వల్ల ముఖంపై ఉండే నలుపు తగ్గి చర్మ ఛాయ ఇనుమడిస్తుందనేది సింహళ దేశపు మగువల అభిప్రాయం. అలాగే ఈ ఫేస్‌ప్యాక్ ద్వారా ముఖంపై ఏర్పడిన ముడతలు, గీతలు మటుమాయమవడంతో పాటు చర్మానికి తేమ కూడా అందుతుంది.

ఒత్త్తెన కనుబొమ్మలకు..

అందాన్ని పెంచడంలో కనుబొమ్మల పాత్ర కూడా కీలకమే. అవి ఒత్తుగా, నల్లగా ఉంటేనే ముఖం మరింత అందంగా కనిపిస్తుంది. ఆ ప్రయోజనాల్ని పొందడానికే శ్రీలంకన్ మగువలు నల్ల జీలకర్ర నూనెను ఆశ్రయిస్తుంటారు. ఆ నూనెను కనుబొమ్మలు, కనురెప్పలపై తరచూ రాసుకోవడం వల్ల అవి ఒత్తుగా పెరగడంతో పాటు నల్లగా కనిపిస్తాయని చెబుతున్నారు అక్కడి సౌందర్య నిపుణులు. అంతేకాదు.. ఈ నూనె చర్మానికి మాయిశ్చరైజర్‌గానూ పనిచేస్తుంది. అందుకే దీంతో చర్మానికి మర్దన చేసుకుంటుంటారు సింహళ దేశపు అతివలు. తద్వారా ఈ నూనెలో ఎక్కువగా ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మంలోకి ఇంకుతాయి. తద్వారా చర్మం మరింత మృదువుగా మారుతుందట.


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్‌ కార్నర్

మరిన్ని

మంచిమాట


'స్వీట్' హోం

మరిన్ని

వర్క్‌ & లైఫ్

మరిన్ని

సూపర్‌ విమెన్

మరిన్ని