Rayana Barnawi: అంతరిక్షంలోకి సౌదీ మహిళ

సౌదీఅరేబియా మహిళలు అన్నిరంగాల్లోనూ అడుగుపెడుతున్నారు. తాజాగా ఆ దేశానికి చెందిన రయ్యనా బార్నవి అంతరిక్షానికి పయనమవనున్నారు.

Published : 17 Feb 2023 00:25 IST

సౌదీఅరేబియా మహిళలు అన్నిరంగాల్లోనూ అడుగుపెడుతున్నారు. తాజాగా ఆ దేశానికి చెందిన రయ్యనా బార్నవి అంతరిక్షానికి పయనమవనున్నారు. సౌదీ నుంచి తొలి మహిళా వ్యోమగామిగా చరిత్రలో నిలవనున్న ఈమె.. మరెందరో మహిళలకు స్ఫూర్తికానున్నారు. 

బాల్యం నుంచి రయ్యనాకు సైన్స్‌ అంటే మక్కువెక్కువ. క్యాన్సర్‌పై అధ్యయనం, పరిశోధన చేయాలనే ఆసక్తి. దీంతో న్యూజిలాండ్‌ ఒటాగో విశ్వవిద్యాలయంలో బయో మెడికల్‌ సైన్సెస్‌లో డిగ్రీ చదివారీమె. ఆ తర్వాత రొమ్ము క్యాన్సర్‌ స్టెమ్‌ సెల్స్‌పై ఆల్‌ఫైజల్‌ యూనివర్శిటీ నుంచి మాస్టర్స్‌ చేశారు. క్యాన్సర్‌ కణాలపై తొమ్మిదేళ్లపాటు పరిశోధన చేపట్టిన అనుభవం ఉందీమెకు. ఆ తర్వాత రియాధ్‌లో కింగ్‌ ఫైజల్‌ స్పెషలిస్ట్‌ హాస్పిటల్‌ అండ్‌ రిసెర్చి సెంటర్‌లో రిసెర్చి ల్యాబోరేటరీ టెక్నీషియన్‌గా చేరారు. ఓవైపు పరిశోధనారంగంలో ఉంటూనే, అంతరిక్షంలోనూ.. అడుగుపెట్టాలనే ఆసక్తి ఈమెను దీనికి సంబంధించిన శిక్షణ తీసుకొనేలా చేసింది. అంతరిక్ష అవకాశానికి ప్రయత్నాలు చేస్తోందీమె. తాజాగా సౌదీ స్పేస్‌ కమిషన్‌ అంతరిక్షంలో చేపట్టనున్న ఆక్సియం మిషన్‌2కు మిషన్‌ స్పెషలిస్ట్‌గా రయ్యనాను ఎంపికచేసినట్లు ప్రకటించడంతో 33 ఏళ్ల రయ్యనా వార్తల్లో నిలిచారు. సౌదీ అరేబియా నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళుతున్న వ్యోమగామి అలీ అల్‌ఖర్నీతో ఈమె చేరనున్నారు. వీరు ప్రయాణించనున్న అంతరిక్షవిమానం అమెరికా నుంచి బయలుదేరనుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్