మట్టి ఇళ్లనే కోరుకుంటున్నారు...

ప్రకృతికి దగ్గరగా ఉంటాయి ఆమె నిర్మించే ఇళ్లు. పర్యావరణ పరిరక్షణకు కేరాఫ్‌ అడ్రస్‌లా కనిపించే అవన్నీ మట్టితో కట్టినవే. వాటికి నేటి ఆధునికతను అద్ది.. గృహనిర్మాణాన్ని చేపడుతున్నారు శరణ్య అయ్యర్‌. 

Published : 07 Feb 2023 00:25 IST

ప్రకృతికి దగ్గరగా ఉంటాయి ఆమె నిర్మించే ఇళ్లు. పర్యావరణ పరిరక్షణకు కేరాఫ్‌ అడ్రస్‌లా కనిపించే అవన్నీ మట్టితో కట్టినవే. వాటికి నేటి ఆధునికతను అద్ది.. గృహనిర్మాణాన్ని చేపడుతున్నారు శరణ్య అయ్యర్‌. 

ర్యావరణానికి అనుకూలంగా ఉండే సాంకేతికతతో ఇల్లు కట్టాలని ఉండేది శరణ్యకు. బెంగళూరుకు చెందిన ఈమెకు గృహనిర్మాణమంటే ఆసక్తి. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కి టెక్చర్‌ అండ్‌ ఫైనార్ట్స్‌ యూనివర్శిటీలో చదివారు. అక్కడ కలిసిన  స్నేహితురాలు మహిళా స్వయంసహాయక బృందం సమావేశానికి జహీరాబాద్‌లో భవనాన్ని డి…జైన్‌ చేయమంది. అక్కడికెళ్లిన శరణ్య స్థానికంగా అధ్యయనం చేపట్టినప్పుడు బిళ్లరాయిని గుర్తించారు. 

 

మొదటి భవనాన్ని..

స్నేహితురాలు అడిగిన భవనాన్ని బిళ్లరాయితోనే నిర్మించారు శరణ్య. ‘నిర్మాణ సమయంలో కొత్త విషయాలెన్నో తెలిశాయి. అక్కడి వాతావరణానికి తగినట్లుగా స్థానికంగా లభ్యమయ్యేవి ఎక్కువగా అనుసంధానమై ఉంటాయి. అధ్యయనంతోపాటు అనుభవమొచ్చింది. ఆ తర్వాత పుదుచ్చేరిలోని ఆరోవిలే ఎర్త్‌ ఇన్‌స్టిట్యూట్‌లో మట్టి ఇల్లు నిర్మాణంపై జరిగిన నెలరోజుల వర్క్‌షాపులో పాల్గొన్నా. దీని తర్వాత చాలామంది మట్టి ఇళ్ల నిర్మాణంవైపు ఆసక్తి పెంచుకున్నారు’ అంటారీమె.

మట్టి ఇళ్లకే..

అర్బన్‌ డిజైన్‌లో మాస్టర్స్‌ చేయడానికి అమెరికా వెళ్లిన శరణ్య అక్కడే నాలుగేళ్లు పని చేశారు. లీడ్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ సర్టిఫికేషన్‌ చేసి ఇండియాకు తిరిగొచ్చారు. ఇక్కడ  గృహ సర్టిఫికేషన్‌ పూర్తిచేసి, 2013లో ‘స్టూడియో వర్జ్‌’ ప్రారంభించారు. ‘వినియోగదారులు మెచ్చేలా భవనాలను నిర్మిస్తున్నా. 75శాతం స్థానిక సంప్రదాయాలకు తగ్గట్లుగా నిర్మిస్తా. చాలామంది ఈ తరహా నిర్మాణాలవైపు మొగ్గు చూపుతున్నారు. పూర్తిగా మట్టినే వినియోగించమని అడుగుతున్నారు. కార్యాలయాల భవనాలకు మాత్రం లుక్‌ కోసం ముందు భాగంలో కొందరు గాజును వాడమంటున్నారు. నివాసభవనాలు, అపార్టుమెంట్లు, పాఠశాలలు, లెర్నింగ్‌ సెంటర్స్‌ సహా ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌, కర్ణాటక పర్యాటక విభాగ భవనాలు వంటివి నిర్మించి ఇచ్చా. దక్షిణభారతంలో తెలంగాణాసహా కర్ణాటక, తమిళనాడు, కేరళలో దాదాపు 50కిపైగా నిర్మాణాలు చేపట్టా’ అంటున్న  ఈమె, పర్యావరణ పరిరక్షణ దిశగా భవననిర్మాణంపై బెంగళూరు కళాశాలల్లో బోధిస్తున్నారు. పాఠశాల పిల్లలకు దీనిపై అవగాహన కలిగించేలా వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్