బుట్టబొమ్మలా నర్తించే నగలు!

‘కాదేదీ కళకనర్హం’ అన్నట్లు.. ఈ కాలపు అమ్మాయిల అభిరుచుల్ని ఆకళింపు చేసుకొని విభిన్న రకాలైన నగలు/యాక్సెసరీస్‌ని రూపొందిస్తున్నారు డిజైనర్లు. ఇలా ప్రత్యేకమైన థీమ్స్‌తో రూపొందించిన ఆయా నగలు కూడా అతివల మనసు దోచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే డ్యాన్సింగ్‌ థీమ్‌తో రూపొందించిన ఆభరణాలూ మగువల్ని....

Updated : 22 Feb 2023 20:37 IST

‘కాదేదీ కళకనర్హం’ అన్నట్లు.. ఈ కాలపు అమ్మాయిల అభిరుచుల్ని ఆకళింపు చేసుకొని విభిన్న రకాలైన నగలు/యాక్సెసరీస్‌ని రూపొందిస్తున్నారు డిజైనర్లు. ఇలా ప్రత్యేకమైన థీమ్స్‌తో రూపొందించిన ఆయా నగలు కూడా అతివల మనసు దోచుకుంటున్నాయి. ఈ క్రమంలోనే డ్యాన్సింగ్‌ థీమ్‌తో రూపొందించిన ఆభరణాలూ మగువల్ని నలుగురిలో ప్రత్యేక ఆకర్షణగా కనిపించేలా చేస్తున్నాయి.

బుట్టబొమ్మలా డ్యాన్స్‌ చేస్తున్నట్లుగా రూపొందించిన చెవిదిద్దులు, పెండెంట్స్‌, బ్రూచ్‌ పిన్స్‌, ఉంగరాలు, బ్రేస్‌లెట్‌ బ్యాంగిల్స్‌.. వంటివెన్నో ఆకర్షణీయంగా తయారుచేస్తున్నారు డిజైనర్లు. వీటిలోనూ రోజ్‌గోల్డ్‌తో పూత పూసినవి, రంగురంగుల రాళ్లు/ముత్యాలు/నవరత్నాలు.. వంటివి పొదిగినవి, క్లాత్‌ జ్యుయలరీ తరహావి.. ఇలా విభిన్న డిజైన్లలో రూపొందించిన ఈ నగలు అమ్మాయిల అందాన్ని రెట్టింపు చేస్తున్నాయి. అటు సంప్రదాయ దుస్తుల పైనే కాదు.. ఇటు ట్రెండీ అవుట్‌ఫిట్స్ పైనా ఇట్టే నప్పుతోన్న ఈ నగల్ని ఇష్టపడని అమ్మాయి ఉండదంటే అతిశయోక్తి కాదు. అలాంటి కొన్ని స్టైలిష్‌ డ్యాన్సింగ్‌ జ్యుయలరీ పీసెస్‌పై మీరూ ఓ లుక్కేసేయండి!

Photos: Amazon.in

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్