భలే భలే హ్యాండ్‌ క్లచ్‌!

స్నేహితులతో కలిసి సరదాగా అలా షాపింగ్‌కో, సినిమాకో వెళ్లినప్పుడు.. ఇంకాస్త ఫ్యాషనబుల్‌గా రడీ అయిపోతారు అమ్మాయిలు. దుస్తులు మొదలు యాక్సెసరీస్‌ దాకా.. ప్రతిదీ ట్రెండీగా ఉండాలనుకుంటారు. ఇలాంటి సందర్భంలో పెద్ద పెద్ద హ్యాండ్‌బ్యాగ్‌ల కంటే చేతిలో ఇమిడిపోయే....

Updated : 29 Feb 2024 14:35 IST

స్నేహితులతో కలిసి సరదాగా అలా షాపింగ్‌కో, సినిమాకో వెళ్లినప్పుడు.. ఇంకాస్త ఫ్యాషనబుల్‌గా రడీ అయిపోతారు అమ్మాయిలు. దుస్తులు మొదలు యాక్సెసరీస్‌ దాకా.. ప్రతిదీ ట్రెండీగా ఉండాలనుకుంటారు. ఇలాంటి సందర్భంలో పెద్ద పెద్ద హ్యాండ్‌బ్యాగ్‌ల కంటే చేతిలో ఇమిడిపోయే క్లచ్‌లతో మెరిసిపోవాలనుకునే అమ్మాయిలే ఎక్కువ. అలాంటి ఫ్యాషన్‌ క్వీన్స్‌ కోసం ప్రస్తుతం సరికొత్త హ్యాండ్‌ క్లచ్‌లు మార్కెట్లో కొలువుదీరాయి.

గన్‌, త్రిభుజాకారం, పండ్ల ఆకృతిలో రూపొందించినవి, పేస్ట్రీ షేప్‌లో తయారుచేసినవి, పంజరాన్ని పోలినవి, గుండ్రంగా-బాల్‌ మాదిరిగా రూపొందించినవి, కొరికిన యాపిల్‌ షేప్‌లో ఉన్నవి, ఎంబ్రాయిడరీతో డిజైన్‌ చేసినవి, హృదయాకృతిలో ఉన్నవి, సముద్రపు చిప్ప ఆకృతిలో రూపొందించినవి, పెదాలను పోలి ఉన్నవి.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఆకర్షణీయమైన క్లచ్‌లు ఫ్యాషన్‌ ప్రియుల మనసు దోచుకుంటున్నాయి. వీటిని చేత్తోనైనా పట్టుకోవచ్చు.. లేదంటే ఓ స్లింగ్‌ తగిలించి భుజానికైనా వేసుకోవచ్చు. వీటిలోనూ కొన్ని ప్రెస్సింగ్‌ మాదిరిగా, మరికొన్ని జిప్‌ తరహాలో ఉన్నవీ దొరుకుతున్నాయి. మరి, అమ్మాయిల్ని స్టైలిష్‌గా, ట్రెండీగా మార్చేస్తోన్న అలాంటి కొన్ని వెరైటీ హ్యాండ్‌ క్లచ్‌లను ఇక్కడ చూసేయండి!

Photos: Amazon.in

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్