నాణ్యతలో రాజీ పడకూడదు!

మారుతోన్న అవసరాలకు అనుగుణంగా... ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఇండియన్‌ జీ20 ప్రెసిడెన్సీ (2023-25) ప్రపంచస్థాయిలో గొప్ప వ్యాపార, వాణిజ్య పెట్టుబడి అవకాశాల్ని అందిస్తోంది.

Updated : 05 Jan 2023 12:07 IST

అనుభవ పాఠం

మారుతోన్న అవసరాలకు అనుగుణంగా... ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. ఇండియన్‌ జీ20 ప్రెసిడెన్సీ (2023-25) ప్రపంచస్థాయిలో గొప్ప వ్యాపార, వాణిజ్య పెట్టుబడి అవకాశాల్ని అందిస్తోంది. దాన్ని మేం వందశాతం వినియోగించుకోవాలనుకుంటున్నాం. ప్రపంచంలోనే టాప్‌ 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలబడాలనే ఆశావహ దృక్పథంతో అడుగులేస్తున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన బాధ్యత కొత్త తరానిదే. దాన్ని గుర్తించి లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలి. ఆ ప్రయాణంలో ఎదురైన అవాంతరాలనూ, అడ్డంకులనూ అధిగమించి... వాటిని అవకాశాలు సృష్టించుకోవడానికి ఉపయోగించుకోగలగాలి. అప్పుడు మనం ఎదగడమే కాదు... సమాజ అవసరాలను తీరుస్తూ, దేశ ప్రతిష్ఠను పెంచే స్థాయిలో నిలబడగలం. యువత నచ్చిన వృత్తుల్లో స్థిరపడాలంటే... కొత్త విషయాలను నేర్చుకోవడానికి వెనుకాడకూడదు. నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీ పడకూడదు. పోటీతత్వాన్ని అనుసరించాలి. నూతన ఆవిష్కరణలపై దృష్టిపెట్టాలి. మన వనరులనూ, బలాల్నీ సానుకూలంగా మలుచుకుని అందరితో కలిసి పనిచేయాలి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ స్థాయినీ, శక్తినీ పెంచుకుంటూ ఎదగాలి. టీం వర్క్‌ని బలపరుచుకోవాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది.

- సుచిత్ర ఎల్ల, కో ఫౌండర్‌, ఎండీ, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్