హెయిర్‌ బన్‌.. స్టైలిష్‌గా వేసేద్దాం!

అసలే ఎండాకాలం.. జుట్టు విరబోసుకొనే సాహసం చేసే వారు అరుదుగా కనిపిస్తుంటారు. క్యాజువల్‌గానైనా, అకేషనల్‌గానైనా జుట్టు ముడుచుకోవడమో, చక్కగా జడ వేసుకోవడమో చేస్తుంటారు. ఈ క్రమంలో హెయిర్‌ బన్‌ని ఇష్టపడే వారూ ఉంటారు.

Published : 28 Mar 2024 13:16 IST

అసలే ఎండాకాలం.. జుట్టు విరబోసుకొనే సాహసం చేసే వారు అరుదుగా కనిపిస్తుంటారు. క్యాజువల్‌గానైనా, అకేషనల్‌గానైనా జుట్టు ముడుచుకోవడమో, చక్కగా జడ వేసుకోవడమో చేస్తుంటారు. ఈ క్రమంలో హెయిర్‌ బన్‌ని ఇష్టపడే వారూ ఉంటారు. అలాంటి వారి కోసం సరికొత్త హెయిర్‌బన్‌ ర్యాప్స్‌/కర్లర్స్‌ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

చిన్న బెల్టు, తాడు మాదిరిగా ఉండే వీటిని జుట్టు చివర్లలో ఉంచి.. జుట్టుతో పాటు లోపలికి ముడుచుకుంటూ పైదాకా తీసుకురావాలి. ఆపై రెండు చివర్లను క్రిస్‌-క్రాస్‌గా ప్రెస్‌ చేస్తే సరి.. బన్‌ హెయిర్‌స్టైల్‌ క్షణాల్లో సిద్ధమైపోతుంది. స్టిఫ్‌గా ఉండే ఈ బెల్టు/తాడుకు రెండు చివర్లలో రిబ్బన్‌, పూసలు, ముత్యాలు, స్టోన్స్‌.. వంటివి పొదిగిన వివిధ ఆకృతులు అమరి ఉంటాయి. వాటితో హెయిర్‌ బన్‌కు స్టైలిష్‌ లుక్‌ వస్తుంది. ఇవే కాదు.. హెయిర్‌ బన్‌ అందాన్ని ద్విగుణీకృతం చేసే క్లిప్స్‌, ఫ్లక్కర్స్‌, హ్యాంగింగ్‌ తరహా హెయిర్‌ క్లచ్‌.. వంటివెన్నో ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్నాయి. వీటితో హెయిర్‌ బన్‌కు హంగులద్ది ఎలాంటి సందర్భంలోనైనా అందంగా, స్టైలిష్‌గా, ఫ్యాషనబుల్‌గా మెరిసిపోవచ్చు. అలాంటి హెయిర్‌ బన్‌ యాక్సెసరీస్‌పై మీరూ ఓ లుక్కేసేయండి!

Photos: Amazon.in

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్