అమ్మ చెప్పిన చిట్కాలతోనే అందాన్ని కాపాడుకుంటున్నా..!

తెర వెనుక ఎలా ఉన్నా.. తెరపై అందంగా, పాత్రకు అనుగుణంగా కనిపించడానికి చాలామంది సినీ తారలు మేకప్‌ను ఆశ్రయిస్తారన్న విషయం తెలిసిందే! అయితే ఈ ఉత్పత్తుల్లోని రసాయనాలు, ఇతర పదార్థాలు చర్మానికి హాని కలిగించి.. సహజ అందాన్ని దెబ్బతీస్తాయి. అందుకే తెర వెనుక చర్మ సౌందర్యానికి అధిక....

Published : 16 Dec 2022 16:44 IST

(Photos: Instagram)

తెర వెనుక ఎలా ఉన్నా.. తెరపై అందంగా, పాత్రకు అనుగుణంగా కనిపించడానికి చాలామంది సినీ తారలు మేకప్‌ను ఆశ్రయిస్తారన్న విషయం తెలిసిందే! అయితే ఈ ఉత్పత్తుల్లోని రసాయనాలు, ఇతర పదార్థాలు చర్మానికి హాని కలిగించి.. సహజ అందాన్ని దెబ్బతీస్తాయి. అందుకే తెర వెనుక చర్మ సౌందర్యానికి అధిక ప్రాధాన్యమిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ క్రమంలో ఇంట్లో లభించే సహజసిద్ధమైన పదార్థాలనే వినియోగిస్తానంటోన్న ఈ ముద్దుగుమ్మ.. తన సౌందర్య రహస్యాల్ని ఇటీవలే ఓ సందర్భంలో బయటపెట్టింది. మరి, ఆ అపురూప లావణ్యం వెనకున్న సీక్రెట్సేంటో మనమూ తెలుసుకుందాం రండి..

‘గుర్తుందా శీతాకాలం’తో ఇటీవలే మన ముందుకొచ్చింది తమన్నా. పాల మీగడ లాంటి అందానికి తోడు అభినయంతోనూ ప్రతి సినిమాలో ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ.. మేకప్‌ లేకుండా తెరపై నటించడానికీ వెనకాడదు. అయితే కెరీర్‌లో భాగంగా ఎక్కువ శాతం మేకప్‌తో పాటు ఇతర హెయిర్‌ స్టైలింగ్‌ ఉత్పత్తుల్ని తన రొటీన్‌లో భాగం చేసుకునే తమ్మూ.. వాటి వల్ల తన చర్మానికి, జుట్టుకు నష్టం వాటిల్లకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటానంటోంది.

అమ్మ చిట్కాలు పాటిస్తున్నా!

‘టీనేజ్‌ వయసు నుంచే నేను వినోద రంగంలో పనిచేస్తున్నా. నా వృత్తిలో భాగంగా మేకప్‌ వేసుకోవడం తప్పనిసరి. అయితే వాటిలోని రసాయనాలు నా చర్మంపై ప్రతికూల ప్రభావం చూపకుండా అమ్మ సలహా మేరకు కొన్ని సహజసిద్ధమైన పదార్థాల్ని నా బ్యూటీ రొటీన్‌లో చేర్చుకున్నా. ప్రస్తుతం ఆ చిట్కాలతోనే నా అందాన్ని సంరక్షించుకుంటున్నా.

మృతకణాలు మాయం!

రోజూ మేకప్‌ వేసుకోవడం, ఎండలో ఎక్కువ సమయం గడపడం వల్ల ముఖంపై మృతకణాలు ఏర్పడుతుంటాయి. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చందనం, కాఫీ పొడి, తేనె.. ఈ మూడింటినీ కలిపి స్క్రబ్‌ తయారుచేసుకుంటా. వీటిని టీస్పూన్‌ చొప్పున తీసుకొని బాగా కలుపుకోవాలి. పొడిచర్మతత్వం ఉన్నవారు మరో టీస్పూన్‌ తేనెను చేర్చుకోవచ్చు. తద్వారా చర్మం మరింత తేమగా మారుతుంది. ఈ మిశ్రమాన్ని చేతి మునివేళ్లతో ముఖానికి, మెడకు పట్టించాలి.. కళ్ల కింద భాగం సున్నితంగా ఉంటుంది కాబట్టి అక్కడ దీన్ని అప్లై చేయకపోవడమే మంచిది. ఇప్పుడు ముఖంపై మరోసారి నెమ్మదిగా మర్దన చేసుకొని.. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్‌ వల్ల చర్మం తాజాగా మారడంతో పాటు ముఖంపై ఏర్పడిన మృతకణాలు కూడా తొలగిపోతాయి.

తేమను తిరిగి పొందేలా..!

చిన్నతనంలో నా చర్మం అతి సున్నితంగా ఉండేది. ఏదైనా మేకప్‌ ఉత్పత్తి ఉపయోగిస్తే చాలు.. వెంటనే ర్యాషెస్‌ వచ్చేసేవి. అప్పుడే శెనగపిండి, పెరుగు, రోజ్‌వాటర్‌ నాకు పరిచయమయ్యాయి. ఒక్కోసారి కేవలం రోజ్‌వాటర్‌ ఒక్కటే అప్లై చేసుకునేదాన్ని. ఈ మూడు పదార్థాల్ని బాగా కలుపుకొని చేతి వేళ్లతో ముఖానికి, మెడకు పట్టించాలి. ఈ ప్యాక్‌ని కళ్ల కింద భాగంలోనూ అప్లై చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆరాక చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఈ చిట్కా పొడిబారిపోయిన చర్మం తిరిగి తేమను సంతరించుకునేలా చేస్తుంది. ఇప్పటికీ ఈ ప్యాక్‌ని తరచూ ఉపయోగిస్తున్నా. ముఖ్యంగా చల్లటి ప్రదేశాల్లో షూటింగ్‌కి హాజరయ్యే క్రమంలో దీన్ని వేసుకుంటా. చల్లటి వాతావరణం వల్ల బిగుసుకుపోయి, మూసుకుపోయిన చర్మ రంధ్రాలు తిరిగి తెరుచుకునేందుకు తరచూ ఆవిరి కూడా పడుతుంటా. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ముఖానికి ఏ ప్యాక్‌ అప్లై చేసుకున్నా ముందు ఓసారి ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకోవడం మర్చిపోవద్దు. తద్వారా వాటిలో వాడే ఏ పదార్థమైనా మీ చర్మానికి సరిపడకపోతే ముందే గుర్తించచ్చు.

ఉబ్బిన ముఖానికి ఉపశమనం..!

చిన్నతనంలో నా చర్మం అతి సున్నితంగా ఉండేది. ఏదైనా మేకప్‌ ఉత్పత్తి ఉపయోగిస్తే చాలు.. వెంటనే ర్యాషెస్‌ వచ్చేసేవి. అప్పుడే శెనగపిండి, పెరుగు, రోజ్‌వాటర్ వాడడం మొదలుపెట్టాను. ఒక్కోసారి కేవలం రోజ్‌వాటర్‌ ఒక్కటే అప్లై చేసుకునేదాన్ని. ఈ మూడు పదార్థాల్ని బాగా కలుపుకొని చేతి వేళ్లతో ముఖానికి, మెడకు పట్టించాలి. ఈ ప్యాక్‌ని కళ్ల కింద భాగంలోనూ అప్లై చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆరాక చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఈ చిట్కా పొడిబారిపోయిన చర్మం తిరిగి తేమను సంతరించుకునేలా చేస్తుంది. ఇప్పటికీ ఈ ప్యాక్‌ని తరచూ ఉపయోగిస్తున్నా. ముఖ్యంగా చల్లటి ప్రదేశాల్లో షూటింగ్‌కి హాజరయ్యే క్రమంలో దీన్ని వేసుకుంటా. చల్లటి వాతావరణం వల్ల బిగుసుకుపోయి, మూసుకుపోయిన చర్మ రంధ్రాలు తిరిగి తెరుచుకునేందుకు తరచూ ఆవిరి కూడా పడుతుంటా. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ముఖానికి ఏ ప్యాక్‌ అప్లై చేసుకున్నా ముందు ఓసారి ప్యాచ్‌ టెస్ట్‌ చేసుకోవడం మర్చిపోవద్దు. తద్వారా వాటిలో వాడే ఏ పదార్థమైనా మీ చర్మానికి సరిపడకపోతే ముందే గుర్తించచ్చు.

జుట్టుకు ఉల్లి రసం!

వివిధ రకాల హెయిర్‌ స్టైలింగ్‌ ఉత్పత్తుల వల్ల జుట్టు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అందుకే వాటి ప్రభావం నుంచి జుట్టును రక్షించుకోవడానికి ఉల్లి రసం అప్లై చేసుకుంటా. ముందుగా కొద్దిగా ఉల్లి రసాన్ని మూడు టేబుల్‌స్పూన్ల కొబ్బరి నూనెలో కలుపుకొని తయారుచేసుకున్న మిశ్రమాన్ని జుట్టుకు, కుదుళ్లకు పట్టించాలి. ఆపై అరగంట పాటు ఉంచుకొని.. గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి. ఈ చిట్కా నా జుట్టు తేమగా, ప్రకాశవంతంగా ఉండేందుకు దోహదం చేస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్