ఈ ఆహారంతో దంతాలు మెరుస్తాయ్‌!

మనం తినే ఆహారంతో పాటు సరైన దంత సంరక్షణ లేకపోవడం వల్ల పలు రకాల పంటి, చిగుళ్ల సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే ఈ అనారోగ్యపూరిత అలవాట్ల వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతుంటాయి.

Published : 28 Nov 2023 12:24 IST

మనం తినే ఆహారంతో పాటు సరైన దంత సంరక్షణ లేకపోవడం వల్ల పలు రకాల పంటి, చిగుళ్ల సమస్యలు వచ్చే అవకాశముంటుంది. అలాగే ఈ అనారోగ్యపూరిత అలవాట్ల వల్ల దంతాలు పసుపు రంగులోకి మారుతుంటాయి. అలా జరగకుండా పంటి ఆరోగ్యానికి, అవి తళతళా మెరిసిపోవడానికి రోజూ తీసుకునే ఆహారంలో ఈ పదార్థాలు చేర్చుకోవాలంటున్నారు నిపుణులు.

స్ట్రాబెర్రీల్లో మాలిక్‌ ఆమ్లం ఉంటుంది. ఇది దంతాలను మెరిపిస్తుంది. వీటిలోని శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు దంతాలపై మరకలకు కారణమైన బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయి. చిగుళ్లలో వాపు రాకుండా చేస్తాయి.

దంతాలను సహజంగా శుభ్రపరిచి, మెరిపించే గుణం పైనాపిల్‌కు ఉంది. ఇందులోని బ్రొమెలైన్‌ అనే ఎంజైమ్‌ సహజసిద్ధ క్లెన్సర్‌గా పనిచేస్తుంది.

క్యారట్‌ని హల్వాగానో, జ్యూస్‌లానో చేసుకొని తీసుకోవడం కంటే చక్కగా శుభ్రం చేసి పచ్చిగా తినడం మంచిది. పళ్లపై ఇతర పదార్థాల కారణంగా పేరుకున్న బ్యాక్టీరియా, వ్యర్థాలను ఇది తొలగిస్తుంది. అలాగే క్యారట్‌ నమిలే క్రమంలో దంతాలకు తగిన వ్యాయామం అంది చిగుళ్లు కూడా బలపడతాయి.

పోషకాలు నిండిన క్యాలీఫ్లవర్‌ వ్యాధినిరోధక శక్తిని పెంచడంతో పాటు దంతాలనూ మెరిపిస్తుంది. ఇందులో పీచు ఎక్కువ కాబట్టి తినేటప్పుడు నోట్లో లాలాజలం ఊరుతుంది. ఇది దంతాల ఎనామిల్‌పై మరకలు పడకుండా చేస్తుంది.

పెరుగు, జున్ను కూడా దంతాలను మెరిపిస్తాయి. వీటిలో అధికంగా ఉండే క్యాల్షియం, మాంసకృత్తులు దంతాలపై ఉండే ఎనామిల్‌ను కాపాడతాయి. వీటిలోని ల్యాక్టికామ్లం దంతాలకు రక్షణనిస్తుంది. పెరుగులోని ఫాస్ఫరస్‌ దంతాల రంగు మారకుండా కాపాడుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్