పార్టీకి.. ప్రత్యేకంగా!

కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడమంటే కేకు కోయడమేనా? స్నేహితులతో విందు, వినోదాలు, సరదాలూ మామూలే. మరి ఆకట్టుకోవాలిగా! ఏం వేసుకోవాలా అని ఆలోచిస్తున్నారా? వీటినోసారి చూసేయండి.

Updated : 29 Dec 2022 00:24 IST

కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడమంటే కేకు కోయడమేనా? స్నేహితులతో విందు, వినోదాలు, సరదాలూ మామూలే. మరి ఆకట్టుకోవాలిగా! ఏం వేసుకోవాలా అని ఆలోచిస్తున్నారా? వీటినోసారి చూసేయండి.

ఫ్లెయిర్‌.. స్నేహితులతో చిన్న పార్టీ అన్నప్పుడు అదనపు హంగులేమీ అవసరం ఉండదు. కానీ ఫొటో రెడీగా ఉండాలి. అలాంటివారికి ఫ్లెయిర్‌ ఫ్రాక్‌లు ఉత్తమ ఎంపిక. లైట్‌ వెయిట్‌వి ఎంచుకుంటే ఒక్కచోటే కుర్చుని ఉండాలన్న బాధా ఉండదు. ముత్యాలు, రాళ్లతో చేసిన చెవులవి వీటి మీదకి నప్పుతాయి.

పలాజో.. సంప్రదాయం, ఆధునికం దేనికైనా పలాజోతో మెప్పించేయొచ్చు. సందర్భానికి తగ్గట్టుగా షార్ట్‌, పెప్లమ్‌ బ్లవుజులు లేదా లాంగ్‌కోట్‌తో జత చేసుకుంటే సరి. పొడవైన జుంకీలు, చేతికి వాచ్‌ లేదా బ్రేస్‌లెట్‌ పెడితే పార్టీ అలంకరణ పూర్తయినట్లే.

లాంగ్‌ ట్యూనిక్‌.. లాంగ్‌ ఫ్రాక్‌లానే కనిపిస్తూ.. స్టైలిష్‌ లుక్‌ని ఇస్తుందిది. కాస్త లేత రంగులను ఎంచుకుంటే యువరాణిలా మెరిసి పోవచ్చు. చిన్న చెయిన్‌, స్టడ్స్‌, బ్రేస్‌లెట్‌ వేస్తే సరిపోతుంది.

ధోతీ/ లాంగ్‌ స్కర్ట్‌.. సమయం ఎక్కువ లేదు అనుకున్నప్పుడు లాంగ్‌స్కర్ట్‌ను ఎంచేసుకోవచ్చు. దానికి మిక్స్‌ అండ్‌ మ్యాచ్‌ షర్ట్‌, టీషర్ట్‌, బ్లవుజ్‌ ఏది వేసినా లుక్‌ మారిపోతుంది. ఇప్పుడు కొత్తగా ధోతి స్టయిల్‌ వస్తోంది. ఎవరికైనా ఇట్టే నప్పేస్తుంది. స్టడ్స్‌, పొడవైన జుంకీలు ఏవి పెట్టినా ఆకట్టుకోవడం ఖాయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్