చెడు కొలెస్ట్రాల్‌ను చేరనివ్వవు..

రాధ నిత్యం వ్యాయామం చేస్తుంది. పోషకాహారం తీసుకుంటుంది. మెనోపాజ్‌లోకి అడుగుపెడుతున్న ఆమెకు పరీక్షల్లో చెడు కొలెస్ట్రాల్‌ ఉన్నట్లు తెలియడంతో ఆందోళన మొదలైంది.

Published : 01 Mar 2023 00:05 IST

రాధ నిత్యం వ్యాయామం చేస్తుంది. పోషకాహారం తీసుకుంటుంది. మెనోపాజ్‌లోకి అడుగుపెడుతున్న ఆమెకు పరీక్షల్లో చెడు కొలెస్ట్రాల్‌ ఉన్నట్లు తెలియడంతో ఆందోళన మొదలైంది. శరీరంలో ఇది చేరకుండా ఉండాలంటే ఆహారంలో కొన్నింటిని చేర్చుకోమంటున్నారు నిపుణులు.

పీచు పుష్కలంగా ఉండే ఓట్స్‌ చెడు కొలెస్ట్రాల్‌ను దరికి చేరనివ్వదు. ప్రతిరోజు అయిదు నుంచి పది గ్రాములు ఉదయం అల్పాహారంలో ఉండేలా జాగ్రత్తపడితే చాలు. వీటితోపాటు అరటిపండు లేదా బెర్రీలు చేర్చుకుంటే ఇంకా మంచిది.

చిక్కుడు.. ఉడికించిన బీన్స్‌లో పీచు మెండు. వీటిని తీసుకున్న తర్వాత ఎక్కువసేపు ఆకలి వేయదు. దీంతో అధిక బరువు సమస్యకూ దూరంగా ఉండొచ్చు. బ్లాక్‌, కిడ్నీ బీన్స్‌ సహా ఆకుకూరలు వంటివాటితో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు.

చేప.. దీనిలో పుష్కలంగా ఉండే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ రక్తంలో గడ్డలేర్పడకుండా చేస్తాయి. కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గిస్తాయి. వారానికి కనీసం రెండు లేదా మూడుసార్లు చేపలు తీసుకోవడం తప్పనిసరి చేసుకోండి. ఇంకా కనోలా నూనె, అవిసెగింజలు, వాల్‌నట్స్‌ వంటివీ చెడు కొలెస్ట్రాల్‌ను దరిచేరనివ్వవు.

పండ్లు.. పీచుకు కేరాఫ్‌గా ఉండే పండ్లు నిత్యం ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గిస్తాయి.యాపిల్‌, ద్రాక్ష, సిట్రస్‌ పండ్లు, స్ట్రాబెర్రీ తదితర పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమెటరీ గుణాలుండి రక్తసరఫరాను మెరుగ్గా ఉంచుతాయి. కొలెస్ట్రాల్‌ పేరుకోకుండా కాపాడి హృద్రోగాలు, బ్రెయిన్‌ స్ట్రోక్స్‌ రాకుండా పరిరక్షిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్