స్ట్రాప్‌లెస్ బ్రా.. సౌకర్యంగా ఉండాలంటే..!

లోదుస్తులు సౌకర్యాన్నే కాదు.. వేసుకున్న డ్రస్‌కు అందాన్నీ తీసుకొస్తాయి. అందుకే వాటిని శరీరాకృతికి తగ్గట్లుగా సరైన సైజుల్లో ఎంచుకుంటాం. అయితే ట్యూబ్‌ టాప్స్‌, ఆఫ్‌-షోల్డర్‌ డ్రస్సులు ధరించే క్రమంలో.. స్ట్రాప్‌లెస్‌ బ్రా ఎంచుకోవడం తెలిసిందే....

Published : 30 Mar 2024 19:26 IST

లోదుస్తులు సౌకర్యాన్నే కాదు.. వేసుకున్న డ్రస్‌కు అందాన్నీ తీసుకొస్తాయి. అందుకే వాటిని శరీరాకృతికి తగ్గట్లుగా సరైన సైజుల్లో ఎంచుకుంటాం. అయితే ట్యూబ్‌ టాప్స్‌, ఆఫ్‌-షోల్డర్‌ డ్రస్సులు ధరించే క్రమంలో.. స్ట్రాప్‌లెస్‌ బ్రా ఎంచుకోవడం తెలిసిందే. మరి, ఎలాగూ ఇది బయటికి కనిపించదు కదా అని దాన్ని ఎంపిక చేసుకునే విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అసౌకర్యానికి గురయ్యే అవకాశాలే ఎక్కువంటున్నారు నిపుణులు. అందుకే స్ట్రాప్‌లెస్‌ బ్రా కొనేటప్పుడు, దాన్ని ధరించేటప్పుడు కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవడం ముఖ్యమంటున్నారు.

వెడల్పాటి బ్యాండ్!
స్ట్రాప్‌లెస్‌ బ్రా కొనేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే.. దాని బ్యాండ్‌ సైజు. ఈ క్రమంలో ఛాతీ చుట్టుకొలత కంటే తక్కువ సైజున్నది ఎంచుకోవాల్సి ఉంటుంది. తద్వారా బ్యాండ్‌ ఎలాస్టిక్‌ సాగి.. బ్రా వక్షోజాలకు సరిగ్గా ఫిట్‌ అవుతుంది. అదే కాస్త వదులుగా ఉన్నది ఎంచుకుంటే జారిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఈ విషయం దృష్టిలో ఉంచుకొని.. సౌకర్యంగా ఉండే బ్రాను ఎంచుకోవాలి. అలాగే బ్యాండ్‌ వెడల్పు కూడా ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మరీ సన్నగా కాకుండా కాస్త వెడల్పుగా ఉంటేనే ఛాతీకి పట్టినట్లుగా, సౌకర్యవంతంగా ఉంటుందని గుర్తు పెట్టుకోండి. అలాగే ఛాతీ కాస్త పెద్దగా ఉన్న వారికీ వెడల్పాటి బ్యాండ్‌ ఉన్న బ్రా ధరిస్తే సౌకర్యంగా ఉంటుంది.

అవుట్‌ఫిట్‌ ఫిట్‌గా ఉందా?
స్ట్రాప్‌లెస్‌ బ్రా వేసుకునే క్రమంలో.. దాని పైనుంచి ధరించే అవుట్‌ఫిట్‌ విషయంలోనూ సరైన శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. అంటే.. వేసుకునే డ్రస్‌ ఛాతీ నుంచి నడుం వరకు శరీరానికి చక్కగా ఫిట్‌ అయ్యేలా చూసుకోవాలి. అలాకాకుండా.. ఛాతీ వద్ద వదులుగా ఉండి, నడుం దగ్గర బిగుతుగా ఉంటే.. బ్రా పైకి జరిగి బయటికి కనిపించే అవకాశం ఉంటుంది. అదే.. ఛాతీ వద్ద బిగుతుగా ఉండి, నడుం దగ్గర వదులుగా ఉంటే.. బ్రా కిందికి జారిపోవచ్చు కూడా! ఈ అసౌకర్యాన్ని అధిగమించాలంటే.. ధరించే అవుట్‌ఫిట్‌ శరీరాకృతికి సరిగ్గా ఫిట్టవడం ముఖ్యం.

లేస్‌ ఉంటే మంచిది!
స్ట్రాప్‌లెస్‌ బ్రాతో సౌకర్యంగా ఉండాలంటే.. శరీరాకృతికి ఫిట్టయ్యే బ్రా ధరించాలన్న విషయం తెలుసుకున్నాం. అయితే దీనివల్ల బ్రా అచ్చులు డ్రస్‌పై స్పష్టంగా కనిపిస్తాయన్న సందేహం కొంతమందిలో ఉండచ్చు. నిజానికి ఆ సమస్య బ్రా చివర్లు వైర్డ్‌/లైన్‌ తరహాలో రూపొందించినవి ధరించినప్పుడు ఎదురవుతుంది. అందుకే స్ట్రాప్‌లెస్‌ బ్రా ఎంచుకున్నప్పుడు లేస్‌ తరహావి, అన్‌లైన్‌డ్‌ వంటివి ఎంచుకుంటే మంచిది. ఇవి శరీరంలో కలిసిపోయినట్లుగా ఉంటాయి కాబట్టి ఎబ్బెట్టుగా ఫీలవ్వాల్సిన అవసరం ఉండదు. అలాగే ఇలాంటి బ్రాల వల్ల శరీరం పైనా అచ్చులు పడవు.

ప్యాడెడ్‌/నాన్‌ప్యాడెడ్?
అన్ని బ్రాల లాగే స్ట్రాప్‌లెస్‌ బ్రాల్లోనూ ప్యాడెడ్‌, నాన్‌ప్యాడెడ్‌ తరహావి ఉంటాయి. అయితే వీటిని వేసుకునే ముందు ఏ డ్రస్ పైకి ఏవి ధరించాలో తెలిసుండాలంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో కాస్త వదులుగా ఉన్న దుస్తులు ధరించినప్పుడు ప్యాడెడ్‌వి, శరీరానికి పట్టినట్లుగా ఉన్న డ్రస్‌ ఎంచుకున్నప్పుడు నాన్‌ప్యాడెడ్‌వి ఎంచుకుంటే లుక్‌ ఇనుమడిస్తుంది.. అలాగే ఎబ్బెట్టుగా కనిపించకుండా జాగ్రత్తపడచ్చు. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఛాతీ ఎక్కువగా ఉన్న వారు నాన్‌ప్యాడెడ్‌, చిన్నగా ఉన్న వారు ప్యాడెడ్‌ తరహా బ్రా ఎంచుకోవడం మంచిది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్