గర్భం ధరించారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!

తమ కడుపులో పెరుగుతోన్న బిడ్డ ఎదుగుదల గురించే అనుక్షణం ఆలోచిస్తుంది అమ్మ మనసు. ఈ క్రమంలో ఆహారం దగ్గర్నుంచి వ్యాయామాల వరకు.. ప్రతి అంశంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే.

Published : 13 Feb 2024 14:23 IST

తమ కడుపులో పెరుగుతోన్న బిడ్డ ఎదుగుదల గురించే అనుక్షణం ఆలోచిస్తుంది అమ్మ మనసు. ఈ క్రమంలో ఆహారం దగ్గర్నుంచి వ్యాయామాల వరకు.. ప్రతి అంశంలోనూ జాగ్రత్తగా ఉండాల్సిందే.

⚛ గర్భస్థ సమయంలో బిడ్డ ఎదుగుదలకు ఎన్నో ప్రొటీన్లు, విటమిన్లతో కూడిన మాంసాహారం తినడం మంచిదే! అయితే వీటిని బాగా ఉడికించుకొని తీసుకోవడం మంచిది. తద్వారా అవి త్వరగా జీర్ణమవుతాయి.

⚛ ఆహారం ఏ పూటకు ఆ పూటే వేడివేడిగా వండుకొని తీసుకోవాలి. ఉదయం వండినవి సాయంత్రం, రాత్రి వండినవి మరుసటి రోజు వేడి చేసుకొని తినకపోవడమే మంచిది.

⚛ గర్భస్థ సమయంలో మహిళలు పెరిగే బరువు ఆరోగ్యకరంగానే ఉండాలి తప్ప అనారోగ్యకరంగా ఉండకూడదు. ఎందుకంటే అనారోగ్యకరమైన బరువు తల్లీబిడ్డలిద్దరిలో స్థూలకాయానికి దారితీసే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో జంక్‌ఫుడ్‌, ప్రాసెస్డ్‌ ఫుడ్‌, చిప్స్‌, బిస్కట్స్‌.. వంటి వాటికి దూరంగా ఉండాలి. అలాగే స్వీట్స్‌.. మోతాదుకు మించకుండా చూసుకోవాలి.. లేదంటే వాటిలోని కొవ్వులు, చక్కెరలు తల్లీబిడ్డలిద్దరి ఆరోగ్యానికి మంచివి కావు.

⚛ రోజూ తగినన్ని నీళ్లు తాగే విషయంలో అశ్రద్ధ చేయకూడదు. అది కూడా గోరువెచ్చని నీళ్లైతే మంచిదంటున్నారు నిపుణులు.

⚛ వీటితో పాటు నిపుణుల సలహా మేరకు, మీ ఆరోగ్య స్థితిని బట్టి యోగా, చిన్న చిన్న వ్యాయామాలు చేస్తే శరీరం యాక్టివ్‌గా ఉంటుంది.

⚛ అలాగే గర్భం ధరించిన సమయంలో- క్రమం తప్పకుండా చేయించుకోవాల్సిన పరీక్షలు, చెకప్స్ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు.

⚛ ఇదేవిధంగా- గర్భం ధరించిన సమయంలో తీసుకోవాల్సిన పోషకాహారం విషయంలో కూడా ఏమాత్రం నిర్లక్ష్యం పనికిరాదు. ఆయా పదార్థాలు కొంతమంది శరీరతత్వాలకు సరిపడచ్చు.. సరిపడకపోవచ్చు..! కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకోవాల్సిన ఆహారం గురించి మీకున్న సందేహాలను మీలోనే దాచుకోకుండా.. సంబంధిత నిపుణులను సంప్రదించి నివృత్తి చేసుకోవడం శ్రేయస్కరం!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్