Health: గుడ్డు తినడం లేదా?

ప్రొటీన్లతోపాటు శరీరానికి కావాల్సిన పోషకాలెన్నో అందించే గుడ్లంటే కొందరు పిల్లలు మూతి ముడుస్తారు. బదులుగా ఏం పెట్టాలా అని తలపట్టుకుంటున్నారా? ఇదిగో వీటిని ప్రయత్నించమంటున్నారు నిపుణులు..

Published : 26 May 2023 00:01 IST

ప్రొటీన్లతోపాటు శరీరానికి కావాల్సిన పోషకాలెన్నో అందించే గుడ్లంటే కొందరు పిల్లలు మూతి ముడుస్తారు. బదులుగా ఏం పెట్టాలా అని తలపట్టుకుంటున్నారా? ఇదిగో వీటిని ప్రయత్నించమంటున్నారు నిపుణులు..

* బ్రకలీ.. విటమిన్లు, మినరల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం. కొవ్వు, కెలొరీలూ తక్కువే. అధిక ప్రొటీన్‌తోపాటు అదనంగా ఫొలేట్‌, మాంగనీస్‌, పొటాషియం, ఫాస్ఫరస్‌, కె, సి విటమిన్లు అందుతాయి. దీనిలోని గ్లుకోజినోలేట్స్‌ క్యాన్సర్‌కీ వ్యతిరేకంగా పోరాడతాయి.

* బఠాణి.. ఫైబర్‌, ప్రొటీన్‌తోపాటు మాంగనీస్‌, కాపర్‌, ఫాస్ఫరస్‌, జింక్‌, ఐరన్‌ అధిక మొత్తంలో అందుతాయి. స్నాక్స్‌, కూరలు ఏ రూపంలో తీసుకున్నా మంచిదే.

* స్వీట్‌ కార్న్‌.. తక్కువ కొవ్వు, ఎక్కువ ప్రొటీన్‌ దీని ప్రత్యేకత. థయామిన్‌, సి, బి6 విటమిన్లు, ఫొలేట్‌, మెగ్నీషియం, ఫాస్ఫరస్‌ పుష్కలంగా లభిస్తాయి. ఉడకబెట్టి... కాస్త ఉప్పు, మిరియాల పొడి చల్లి ఇవ్వొచ్చు. సూపులు, శాండ్‌విచ్‌ల్లో పెట్టిచ్చినా చక్కగా తినేస్తారు.

* క్యాలిఫ్లవర్‌, పాలకూర.. ప్రొటీన్లతోపాటు శరీరానికి అవసరమైన అమైనో యాసిడ్లు పుష్కలంగా లభిస్తాయి. ఎ, సి, కె విటమిన్లు రోగ నిరోధకతను పెంచుతూనే కంటి ఆరోగ్యాన్నీ సంరక్షిస్తాయి.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్