తాడుతో సాధన చేద్దామా!

మారిన జీవనశైలి... ప్రభావం మొదట కనిపించేది శరీరంపైనే. అందుకే, అందంగా కనిపించాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా... శారీరకంగా దృఢంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి.

Published : 02 Jan 2023 00:34 IST

మారిన జీవనశైలి... ప్రభావం మొదట కనిపించేది శరీరంపైనే. అందుకే, అందంగా కనిపించాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా... శారీరకంగా దృఢంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి. ఇందుకోసం జిమ్‌లకే వెళ్లక్కర్లేదు. ఇంట్లోనే చున్నీ, రెసిస్టెంట్‌ బ్యాండ్‌, తాడు వంటి వాటితోనూ ప్రయత్నించవచ్చు..

 * గుంజిళ్లు తీస్తూ... తాడు లేదా చున్నీని ఒక స్తంభానికో, కిటికీ గ్రిల్‌కో వేయండి. రెండు కొనల్ని రెండు చేతులతో పట్టుకుని మీరు సులువుగా గుంజిళ్లు తీయవచ్చు. అలానే రెసిస్టెన్స్‌ బ్యాండ్‌ని పాదాలతో తొక్కి పెట్టి దాని కొనల్ని చేత్తో పట్టుకుని పైకీ, కిందకీ లేస్తే సరి. దీనివల్ల నడుము, పిరుదుల దగ్గర ఉండే కొవ్వు సులువుగా కరుగుతుంది.

* ముందుగా రెసిస్టెన్స్‌ బ్యాండ్‌ని వీపు వెనక నుంచి ముందుకు తీసుకుని బోర్లా పడుకోండి. ఆపై బ్యాండ్‌ని  బలంగా చేతులతో కింద నొక్కిపెట్టి పుషప్స్‌ చేయాలి. రెసిస్టెంట్‌ బ్యాండ్‌కి సాగే గుణం ఉండటం వల్ల సులువుగా ఈ కసరత్తులు చేయొచ్చు. మొదటిసారి వ్యాయామం చేసేవారు, కాస్త లావుగా ఉండేవారు దీన్ని ఎంచుకుంటే సౌకర్యం. దీనివల్ల చేతుల కండరాలు దృఢమవుతాయి.

* ముందు వెల్లకిలా పడుకోండి.  బ్యాండ్‌ని రెండు పాదాలకు వేయండి. ఇప్పుడు ఒక కాలు ముందుకి, మరో కాలు వెనక్కి పెడుతూ సైక్లింగ్‌ చేయొచ్చు. ఈ క్రంచెస్‌ వల్ల కాలి కండరాలు దృఢపడతాయి. పొట్ట, గర్భాశయం ఆరోగ్యంగా ఉంటాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. అంతేకాదు... శరీరం సౌకర్యవంతంగా కదులుతుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్