కియారాలా మెప్పిస్తారా?

అమ్మాయి జీవితంలో ప్రధాన మలుపు పెళ్లి. తనదైన ఆరోజున మెరిసిపోవాలని ఏ వధువు మాత్రం కోరుకోదు? ఆకర్షించే రంగుల్లో వస్త్రాలు.. మెరిసిపోయే మేకప్‌.. ఈ విధానానికే స్వస్తి చెబుతున్నారు మన కథానాయికలు. తక్కువ మేకప్‌తో ఆకర్షించేస్తున్నారు.

Updated : 09 Feb 2023 00:47 IST

అమ్మాయి జీవితంలో ప్రధాన మలుపు పెళ్లి. తనదైన ఆరోజున మెరిసిపోవాలని ఏ వధువు మాత్రం కోరుకోదు? ఆకర్షించే రంగుల్లో వస్త్రాలు.. మెరిసిపోయే మేకప్‌.. ఈ విధానానికే స్వస్తి చెబుతున్నారు మన కథానాయికలు. తక్కువ మేకప్‌తో ఆకర్షించేస్తున్నారు. మొన్న అలియా నుంచి నేటి కియారా వరకు అనుసరిస్తున్న ఆ మంత్రాన్ని మీరూ ప్రయత్నించేయండిలా..

* నో మేకప్‌, మోనోక్రోమిక్‌ మేకప్‌లుగా వీటిని పిలుస్తున్నారు. అలాగని అసలు మేకప్‌ ఉండదని కాదు. చాలా తక్కువ మొత్తంలో వినియోగించి సహజ లుక్‌ ఇవ్వడం దీని లక్ష్యం. మీ చర్మతీరుకు దగ్గరగా ఉండే ఉత్పత్తులకే ప్రాధాన్యమివ్వాలి.

* శుభ్రమైన ముఖానికి మాయిశ్చరైజర్‌ ఆపై ప్రైమర్‌ రాయాలి. సహజ మెరుపుకే ఈ మేకప్‌లో ప్రాధాన్యం కాబట్టి, హైడ్రేటింగ్‌ ఫేస్‌ ఆయిల్‌ను పూసి, ఆపై బీబీ క్రీమ్‌ రాయాలి. ముఖమంతా ఒకే రంగులో కనిపించాలన్నా, నల్లని వలయాలు, మొటిమల మచ్చలు ఉన్నా కన్సీలర్‌ వాడక తప్పదు.

* కనుబొమలకు కాస్త మందమైన లుక్‌ వచ్చేలా ఐబ్రో పెన్సిల్‌తో లైనింగ్‌ చేయాలి. పెళ్లికూతురి మేకప్‌లో ఫాల్స్‌ ఐలాషెస్‌ మ్యాజిక్‌ చేస్తాయి కదా! కానీ వాడొద్దు. కాస్త కర్ల్‌ చేసి, మస్కారాను ఒకట్రెండుసార్లు రాస్తే సరిపోతుంది. కళ్లమీదుగా సన్నని ఐలైనర్‌, కళ్లకి పలుచగా కాటుక చాలు.

* ఇక ఇప్పుడు మోనోక్రోమ్‌ మేకప్‌ వంతు. ఈ విధానంలో ముఖం, కళ్లు, పెదాలకు ఒకే రంగు ఉపయోగిస్తారు. అలియా, అతియా, కియారా పెళ్లికూతురు లుక్‌ బయటకు రాగానే చాలామంది కామెంట్‌ ‘క్యూట్‌’ అనే! దానికోసం వాళ్లు ఎంచుకున్నది లేత గులాబీ రంగు. న్యూడ్‌ లిప్‌ పెన్సిల్‌తో పెదాలకు అవుట్‌లైన్‌ గీయాలి. తర్వాత అదే రంగు క్రీమ్‌ బ్లష్‌ను బుగ్గలు, ఐషాడోని కనురెప్పలపై వేయాలి. పెదాల సహజ మెరుపునకు లిప్‌గ్లాస్‌ రాస్తే సరి! తారలు మెచ్చిన నో మేకప్‌ లుక్‌ వచ్చేసినట్టే!

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

ఆరోగ్యమస్తు

అనుబంధం

యూత్ కార్నర్

'స్వీట్' హోం

వర్క్ & లైఫ్

సూపర్ విమెన్